Viral Photo: దిమాక్ ఖరాబ్.. తగ్గేదేలే! ఈ ఫోటోలో మొబైల్ ఫోన్‌ను కనిపెట్టండి చూద్దాం..

|

May 24, 2022 | 1:58 PM

ఒక్క క్లిక్ ఇస్తే చాలు.. లెక్కలేనంత ఫన్ మన చేతుల్లోనే ఉంటుంది. అదేంటని అనుకుంటున్నారా.! మొబైల్ ఫోన్ అండీ.!

Viral Photo: దిమాక్ ఖరాబ్.. తగ్గేదేలే! ఈ ఫోటోలో మొబైల్ ఫోన్‌ను కనిపెట్టండి చూద్దాం..
Phone
Follow us on

ఒక్క క్లిక్ ఇస్తే చాలు.. లెక్కలేనంత ఫన్ మన చేతుల్లోనే ఉంటుంది. అదేంటని అనుకుంటున్నారా.! మొబైల్ ఫోన్ అండీ.! అవును.. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ మొబైల్ ఫోన్ వాడటం.. అలాగే ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోవడంతో సామాజిక మాధ్యమాల ద్వారా కావల్సినంత ఫన్ అండ్ రిలాక్సేషన్ మనకు దొరుకుతోంది. ముఖ్యంగా వీడియోలు, రీల్స్ మాత్రమే కాదు.. ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు లాంటివి మన మేధాశక్తిని మరింత పెంచుతున్నాయి. ఇటీవలకాలంలో ఫోటో పజిల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతీ ఒక్కరూ వాటిని ఓ పట్టు పడుతున్నారు. వీటికంటూ ప్రత్యేక పేజీలు కూడా ఉన్నాయి. సండే బుక్స్‌లో వచ్చే పద సంపత్తి ఒక ఎత్తయితే.. ఈ ఫోటో పజిల్స్ మరో ఎత్తు. ఇవి మనల్ని ముప్పుతిప్పలు పెట్టేస్తాయి. మన బుర్రతో గేమ్ ఆడేసుకుంటాయి.. వాటిల్లో దాగున్న చిత్రం పైకి కనిపిస్తున్నా.. కొన్నిసార్లు మన కళ్లు మనల్ని మోసం చేస్తూనే ఉంటాయి. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దానిని సాల్వ్ చేయడంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు.

పైన పేర్కొన్న ఫోటో చూశారా.? ఏం కనిపిస్తోంది.? ఒక టేబుల్.. కింద ఫ్లోర్ మాట్ అని అంటారా.! మీరు చెప్పేది కరెక్టే.! కానీ అక్కడ ఓ మొబైల్ ఫోన్ కూడా ఉంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. ఆ ఫ్లోర్ మాట్‌లో ఇమిడిపోయిన మొబైల్‌ను కనిపెట్టడం చాలా కష్టం అండీ.! ఈ పజిల్‌ను సాల్వ్ చేయడంలో నూటికి 90 మంది ఫెయిల్ అయ్యారు. మరి మీరూ ఓసారి ట్రై చేయండి. మీ కళ్లలో పవర్ ఉన్నట్లయితే.. క్షణాల్లో ఫోన్‌ను కనిపెట్టేయగలరు. ఒకవేళ కనిపెట్టలేకపోతే.. సమాధానం కోసం కింద ఫోటోను చూడండి..

ఇవి కూడా చదవండి

సమాధానం: టేబుల్‌కు కుడి వైపున ఒక్కసారి లుక్కేస్తే మీకు మొబైల్ ఫోన్ కనిపిస్తుంది..