Viral Video: సింహాన్ని రఫ్ఫాడించిన గేదెలు.. దెబ్బకు తోక ముడుచుకుందిగా.. చూస్తే మైండ్ బ్లాంకే!
సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు కొదవలేదు. ఎప్పుడూ ఏదొకటి వైరల్ అవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా జంతువుల..
సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు కొదవలేదు. ఎప్పుడూ ఏదొకటి వైరల్ అవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా జంతువుల కంటెంట్ నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంది. నెట్టింట ట్రెండ్ అయ్యేది కూడా ఇదే. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అదేంటో చూసేద్దాం పదండి..
అడవికి రాజు సింహం. ఇది అందరికీ తెలిసిన విషయం. ఎర ఎంతటి బలశాలి అయినప్పటికీ.. సింగిల్‌గా వార్‌కు దిగి.. భీకరంగా వేటాడేస్తుంది. సింహం పంజా దెబ్బ అట్లాంటిది మరి. అయితే అంతటి బలశాలి అయిన సింహానికి చుక్కలు చూపించాయి గేదెలు. సింగిల్‌గా రౌండప్ చేసి రఫ్ఫాడించాయి. ఇంకేముంది వాటి చక్రవ్యూహం నుంచి తప్పించుకునేందుకు సింహం తంటాలు పడింది.
వైరల్ వీడియో ప్రకారం.. సింహానికి ఛాన్స్ అనేది లేకుండా.. గేదెల గుంపు పక్కా ప్లాన్‌తో దాన్ని చుట్టుముట్టినట్లు మీరు చూడవచ్చు. ఓ ఎత్తైన ప్రదేశంపై ఉన్న సింహం.. వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంది.. నాలుగు వైపులా గేదెల గుంపు దానిపై దాడికి దిగుతాయి. కొమ్ములతో పొడుస్తుంటాయి. కట్ చేస్తే.. చివరికి ఎలాగోలా సింహం ఆ గుంపు నుంచి బ్రతుకు జీవుడా అనుకుంటూ తప్పించుకుంటుంది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిని చూసిన నెటిజన్లు.. ఒకింత షాక్‌కు గురయ్యారు. ‘ఇట్స్ రివెంజ్ టైం.. సింహం జూలు విదిలిస్తుంది’ అని ఒకరు కామెంట్ చేయగా ‘మనది కాని రోజు.. ఇలాగే ఉంటుంది’ అని మరొకరు అన్నారు. లేట్ ఎందుకు వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
View this post on Instagram