మటన్ కొనుగోలు చేస్తున్నారా.? అయితే మీకో షాకింగ్ న్యూస్.! ఈ విషయాలను తెలుసుకోండి..

ఈ మధ్య రిలీజైన నాటు నాటు పాట వింటుంటే.. ఫస్ట్‌ నాటుకోడే గుర్తొచ్చింది. ఈరోజు అసలే సండే.. ముక్కలేకపోతే ముద్ద దిగేదెలా? కోడో..

మటన్ కొనుగోలు చేస్తున్నారా.? అయితే మీకో షాకింగ్ న్యూస్.! ఈ విషయాలను తెలుసుకోండి..
Mutton
Follow us

|

Updated on: Nov 15, 2021 | 4:41 PM

ఈ మధ్య రిలీజైన నాటు నాటు పాట వింటుంటే.. ఫస్ట్‌ నాటుకోడే గుర్తొచ్చింది. ఈరోజు అసలే సండే.. ముక్కలేకపోతే ముద్ద దిగేదెలా? కోడో.. లేదా మటన్‌ లేకపోతే మన నాలుకను శాంతింపజేయలేం. మాంచి మాంసం కూర లేకపోతే ఇగో చల్లారదు. ఇలా చెప్తుంటే వెంటనే వెళ్లి కిలో మటన్‌ కొట్టించుకు రావాలనుంది కదా… కాని ఒక్క సెకన్‌. మీకో షాకింగ్‌.. ఆపైన బ్రేకింగ్‌ న్యూస్‌ చెప్పబోతున్నాం.

ముక్కలేకపోతే ముద్దే దిగదు. పేదోడైతే పావుకిలోనో అరకిలోనే తెచ్చుకుంటాడు.. పెద్దోడు కిలోల చొప్పున పట్టుకొస్తాడు. అల్టిమేట్‌గా సండే.. నీసుకూర ఉండాల్సిందే. కాని మనం తెచ్చుకుంటున్న మటన్‌ మంచిదేనా? నగరంలో ఉన్న వారికి ఈ విషయం తెలుసోలేదో.. మీరు వెళ్లే మటన్‌ షాపు జీహెచ్‌ఎంసీలో రిజిస్టర్‌ అయిందా? మటన్‌ మీద జీహెచ్‌ఎంసీ సీల్‌ వేసుందా.? లేదా?

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ సీల్‌ వేసి ఉంటే.. అది ఫ్రెష్‌ అండ్‌ పర్ఫెక్ట్‌ మటన్‌ అన్నట్లు. కొన్ని చోట్ల ఇలాంటి మటన్ అమ్మరు. మేక కూర అని చెప్పి గొర్రె మటన్‌ అమ్మొచ్చు. పొట్టేలు పేరుతో ఇంకేదో జంతువు మాంసాన్ని తీసుకురావొచ్చు. ఇలాంటి కల్తీ ఉండొద్దనే జీహెచ్‌ఎంసీ సీల్‌ వేసి ఇస్తోంది. తమ పర్మిషన్‌ ఉన్న కబేళాల నుంచే మాంసాన్ని సప్లై చేస్తోంది. నగరంలో మాంసం అమ్మేవారు ఇక్కడనుంచి మాత్రమే తెచ్చుకోవాలి.

సీల్‌ లేకుండా కల్తీ అమ్మే కేటుగాళ్లు కూడా ఉన్నారు. కొన్ని చోట్ల మటన్‌ పేరుతో పెద్ద మాంసం అమ్ముతున్నారు. గతంలో కుక్క మాసాన్ని కూడా విక్రయిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. దీనికి గ్రేటర్‌ మున్సిపల్‌ అధికారులు చెక్‌ పెడుతూ ఈ రూల్స్‌ తీసుకొచ్చారు. ప్రజలు కూడా మటన్‌ షాపుకు వెళ్లినపుడు ఈ సీల్‌ ఉన్న మటన్‌ ను డిమాండ్‌ చేయాలంటున్నారు. దొంగ మటన్‌ అమ్మేవారికి ఫైన్లు వేయడం, కేసులు పెడతామంటున్నారు అధికారులు. మటన్‌, చికెన్‌, బీఫ్‌ అమ్మకాలపై బల్దియా అధికారుల పర్యవేక్షణ ఉంటోంది. ట్రేడ్‌ లైసెన్స్‌ ఉన్న షాపుల్లోనే మాసం తీసుకోవాలి. మాంసం ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలుసుకునే రైట్‌ కస్టమర్లకు ఉందని అధికారులంటున్నారు. స్లాటర్‌ కేంద్రాల నుంచి తీసుకొచ్చే మటన్‌పై బల్దియా ముద్ర ఉంటోంది.

నగరంలో మాంసం అమ్మాలంటే అంబర్‌పేట్‌, బోయిగూడ, చెంగిచర్ల స్లాటర్‌ కేంద్రాల నుంచి మాత్రమే తెచ్చుకోవాలి. కాని నగరంలో చాలా మీట్‌ షాపుల్లో అక్రమాలే జరుగుతున్నాయి. మేక మాంసం పేరుతో గొర్రె మాంసాలను తీసుకొచ్చి.. అధిక రేట్లకు అమ్ముతున్నారు. కొన్ని చోట్ల రెండు మూడు రోజుల క్రితం మటన్‌ను విక్రయిస్తున్నారు. ఇలాంటి వారిపై గ్రేటర్‌ వెటర్నరీ అధికారులు దాడులు జరిపి జరిమానాలు విధిస్తున్నారు.

బల్దియా పరిథిలో ముద్రలేని మాంసం అమ్మే షాపులు ఎక్కువగా కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌ జోన్లలోనే ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ పాడైన, నిల్వ ఉంచిన మాంసాన్ని సైతం అమ్ముతూ సొమ్ముచేసుకుంటున్నారు వ్యాపారులు. ఈ ఏడాది 400పైగా షాపులపై ఫిర్యాదులు అందాయి. ఈ షాపులపై లక్షలాది రూపాయల ఫైన్లు ఉన్నాయి. దాదాపు 60-70షాపులు ట్రేడ్‌లైసెన్సులు లేకుండా ఏర్పాటు చేశారు. ఇలాంటి షాపులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

Also Read:

ఈ 3 రాశులవారు ఏ కష్టమొచ్చినా అబద్దం చెప్పరట.. అందులో మీరున్నారా.!

21 సిక్సర్లు, 16 ఫోర్లు.. సూపర్ ఫాస్ట్ డబుల్ సెంచరీతో బౌలర్లపై వీరవిహారం.. ఆ ఆటగాడు ఎవరంటే.!

Viral News: గోడ నుంచి వింత శబ్దాలు.. బద్దలు కొట్టి చూడగా రెస్క్యూ సిబ్బంది ఫ్యూజులు ఔట్.!

రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..