Patriotic Dog: జంతువులకు కూడా దేశభక్తి ఉంటుందా..? వీడియో చూస్తే ‘అవును’ అని అనకుండా ఉండలేరు..

మన దేశం గురించి ఒక చిన్న విషయం తెలుసుకోవడం కూడా మన మనస్సులో ఉత్తేజకరమైన అనుభూతిని కలిగిస్తుంది. అది మనలోని దేశభక్తికి ప్రతీక. అయితే జంతువులకు కూడా దేశభక్తి ఉంటుందా..?

Patriotic Dog: జంతువులకు కూడా దేశభక్తి ఉంటుందా..? వీడియో చూస్తే ‘అవును’ అని అనకుండా ఉండలేరు..
Patriotic Dog

Updated on: Mar 04, 2023 | 8:15 AM

దేశభక్తి.. పుట్టిన దేశాన్ని ప్రేమించడం, గౌరవించడాన్ని దేశభక్తిగా చెబుతుంటారు. ఇంకా మన దేశం గురించి ఒక చిన్న విషయం తెలుసుకోవడం కూడా మన మనస్సులో ఉత్తేజకరమైన అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఈ దేశభక్తి మనుషుల విషయంలోనే వర్తింపచేస్తారు. మరి జంతువులకు కూడా దేశభక్తి ఉంటుందా..? ఈ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? లేదా ఇదేం పిచ్చి ప్రశ్న..? అని నవ్వుకుంటున్నారా..? కానీ మీరు నమ్మలేని విషయం ఏమిటంటే.. జంతువులకు కూడా దేశభక్తి ఉంటుంది. నమ్మలేరా..? అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ కుక్క వీడియోను మీరు తప్పక చూసి తీరాలి. ఆ వీడియోలో ఒక కుక్క పలు దేశాల మ్యాప్‌లు ఉన్న చిత్రపటాలను దాటుకుని వచ్చి, సరిగ్గా మన దేశం ఉన్న చిత్రపటం వద్ద సాగిలపడి నమస్కరించింది. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

parvatayyahiremat అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోలో మనం ఈ దృశ్యాలను చూడవచ్చు. ముందుగా ఒక వ్యక్తి ఆ కుక్కను భారత్ సహా పలు దేశాల మ్యాప్‌లు ఉన్న చిత్రపటాల వద్ద విడిచిపెడతాడు. ఆ క్రమంలో ఈ కుక్క పాకిస్థాన్, ఇంగ్లాండ్, జర్మనీ వంటి దేశాల చిత్రపటాలను దాటుకుంటూ.. ఆ తర్వాత ఉన్న భారత మ్యాప్ వద్ద సాగిలపడి భరతమాతకు నమస్కరించింది. ఇలా ఆ కుక్క దేశం పట్ల తన దేశభక్తిని ప్రకటించుకుంది. ఇక దీనికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు.. ఆ మూగ జీవాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇంకా ‘జై హింద్, భారతీయుడిగా గర్వపడుతున్నాను’ అంటూ కామెంట్లు చేస్తూ తమ స్పందనను తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి.. 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..