
దేవాలయాల్లో ముస్లీంలు పూజారులుగా ఉన్న ఆలయాన్ని మీరు ఎక్కడైనా చూశారా..? అదేంటి హిందూ ఆలయాల్లో ముస్లిం పూజారులా..? అని ఆశ్చర్యపోతున్నారు కదా.. కానీ, ఇది నిజంగానే జరుగుతోంది. కర్ణాటకలోని గడగ్ జిల్లా కొరికొప్ప గ్రామంలోని లక్ష్మేశ్వర హనుమంతుడి ఆలయంలో ముస్లీంలు పూజారులుగా ఉన్నారు. గత 150 సంవత్సరాలకు పైగా ఇక్కడి హనుమాన్ ఆలయంలో ముస్లిం కుంటుబాలు మాత్రమే పూజారులుగా కొనసాగుతూ వస్తున్నారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ప్రచారంలో ఉంది.. అదేంటో తెలియాలంటే పూర్తి కథనంలోకి వెళ్లా్ల్సిందే..
కర్ణాటకలోని గడగ్ జిల్లాలోని లక్ష్మేశ్వర్ సమీపంలోని కొరికొప్ప హనుమాన్ ఆలయంలో గత 150 సంవత్సరాలుగా ముస్లింలే పూజారులుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇది హిందూ సోదరులు వారికి ఇచ్చిన ప్రత్యేక హక్కుగా తెలిసింది. ఎందుకంటే..ఒకప్పుడు కలరా వ్యాధి వచ్చినప్పుడు గ్రామస్తులంతా వెళ్లిపోయారట. ముస్లీం కుటుంబాలు మాత్రం అక్కడే ఉండి హనుమంతుడిని పూజించాయట. ఆ తర్వాత వ్యాధి తగ్గడంతో ముస్లీంలు ఆలయ పూజ బాధ్యతలు చేపట్టారట. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు.
దీనిని బట్టి చూస్తే.. కోరికొప్ప గ్రామ పెద్దలు సోదరభావం, మత సామరస్యాన్ని పెంపొందించడానికి ఆనాటి నుండి ముస్లింలు పూజలు, ఇతర ఆచారాలను నిర్వహించడానికి అనుమతించారని చెబుతారు. కోరికొప్పలో హిందువులు, ముస్లింలు ఎల్లప్పుడూ శాంతియుతంగా అన్నాదమ్ముల వలే కలిసి జీవిస్తుంటారని, ఈ గ్రామంలో ఎప్పుడూ ఎలాంటి మత ఘర్షణలకు తావు లేకుండా ఉంటున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాదు.. ప్రత్యేక రోజులు, పండుగల సమయాల్లో కుల, మత విభేదాలు లేకుండా గ్రామస్తులంతా కలిసి ఆలయంలో పూజాది కార్యక్రమాలకు హాజరవుతుంటారని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..