ఈ మహిళ సంపాదనకు చేతులే పెట్టుబడి.. కేవలం హ్యాండ్స్ చూపించి నెలకు రూ. 2 లక్షల సంపాదన

|

Apr 29, 2024 | 10:35 AM

ఈ రోజుల్లో అలాంటి ఒక మహిళ వార్తల్లో నిలిచింది. చేతులు చూపించి ఎవరూ ఊహించలేనంత డబ్బు సంపాదిస్తుంది. ఏమిటి చేతిని చూపించి డబ్బు సంపాదిస్తుందా అది ఎలా అని మీరు ఆశ్చర్యపోతున్నారా.. ఈ రోజు ఆ యువతి డబ్బులను ఎలా సంపాదిస్తుందో తెలుసుకుందాం.. వాస్తవానికి ఈ మహిళ వృత్తిరీత్యా 'హ్యాండ్ మోడల్'. దీంతో ఆమె తన ముఖం, శరీరం చూపకుండా కేవలం చేతులు చూపించి డబ్బు సంపాదిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్‌లో నివాసముంటున్న ఈ మహిళ పేరు అలెగ్జాండ్రా బెరోకల్.

ఈ మహిళ సంపాదనకు చేతులే పెట్టుబడి.. కేవలం హ్యాండ్స్ చూపించి నెలకు రూ. 2 లక్షల సంపాదన
Hand Model Woman
Follow us on

డబ్బు సంపాదించడం అంత సులువు కాదు.. అదే సమయంలో డబ్బును సంపాదించడం కూడా చాలా ఈజీనే అని కొందరు చెబుతారు. చాలా సింపుల్ గా డబ్బులు సంపాదిస్తూ కొంతమంది ఉదాహరణగా నిలుస్తున్నారు. వింత పనులు చేస్తూ లక్షలు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నవారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కొందరు రకరకాల విన్యాసాలు చేస్తి డబ్బులు సంపాదిస్తే, మరికొందరు తమ పాదాలను, చేతులను చూపిస్తూ మంచి మొత్తంలో సంపాదిస్తున్నారు. ఈ రోజుల్లో అలాంటి ఒక మహిళ వార్తల్లో నిలిచింది. చేతులు చూపించి ఎవరూ ఊహించలేనంత డబ్బు సంపాదిస్తుంది. ఏమిటి చేతిని చూపించి డబ్బు సంపాదిస్తుందా అది ఎలా అని మీరు ఆశ్చర్యపోతున్నారా.. ఈ రోజు ఆ యువతి డబ్బులను ఎలా సంపాదిస్తుందో తెలుసుకుందాం..

వాస్తవానికి ఈ మహిళ వృత్తిరీత్యా ‘హ్యాండ్ మోడల్’. దీంతో ఆమె తన ముఖం, శరీరం చూపకుండా కేవలం చేతులు చూపించి డబ్బు సంపాదిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్‌లో నివాసముంటున్న ఈ మహిళ పేరు అలెగ్జాండ్రా బెరోకల్. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఆమె ఒక కప్పులో కాఫీ పోయడం లేదా తన చేతులతో పిండిని పిండడం, అక్కడక్కడ రుద్దడం వంటి అనేక రకాల పనులు చేస్తుంది. ఇలా చేసినందుకు ఆమెకు డబ్బు వస్తుంది. ఆమె తన చేతులను వివిధ రకాలుగా చూపిస్తున్న, పని చేస్తున్న వీడియో రూపొందించబడింది. ఆమె పని ఆధారంగా డబ్బులు చెల్లిస్తారు. విశేషమేమిటంటే.. ఇలా పని చేస్తున్న సమయంలో ఆమె తన మొహం చూపించాల్సిన అవసరం లేదు, చేతులు మాత్రమే చూపిస్తే చాలు.

ఇవి కూడా చదవండి

స్నేహితులు కూడా నమ్మలేని నిజం

37 ఏళ్ల అలెగ్జాండ్రా మాట్లాడుతూ కొన్నిసార్లు తన పని గురించి తన స్నేహితులకు చెప్పినప్పుడు, వారు కూడా షాక్ అవుతారు. కేవలం చేయి చూపినందుకు లక్షల రూపాయలు అందుతున్నాయంటే నమ్మలేకపోతున్నారు. తాను 2019 సంవత్సరంలో మోడలింగ్ ప్రారంభించానని.. YSL, Microsoft, బ్రాండన్ బ్లాక్‌వుడ్, కిస్ నెయిల్స్, సెరెనా విలియమ్స్ జ్యువెలరీ వంటి బ్రాండ్‌లతో అనుబంధం కలిగి ఉన్నానని ఆమె చెప్పింది. ఆమె ఈ బ్రాండ్‌ల ఉత్పత్తులకు చేతి మోడలింగ్ చేస్తుంది. ప్రతిఫలంగా కంపెనీలు ఆమెకు చెల్లిస్తాయి.

వార్షిక ఆదాయం రూ.25 లక్షలు

నివేదికల ప్రకారం అలెగ్జాండ్రా ఈ పనిని పార్ట్ టైమ్‌గా చేస్తుంది. అయితే ఇలా తన చేతులను చూపిస్తూ ఆమె సంవత్సరానికి 30 వేల డాలర్లు అంటే దాదాపు 25 లక్షల రూపాయలు సంపాదిస్తుంది. అంటే నెల సంపాదన రూ.2 లక్షలు. కేవలం తన చేతుల వల్లనే ఈ డబ్బు సంపాదిస్తున్నానని, అందుకే తన చేతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని చెప్పింది. తాను తన గోర్లు, వాటి ఆకృతిపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొంది. అంతేకాదు తాను ఏదైనా ఇంటి పని చేయాల్సి వస్తే.. చేతికి, గోర్లకి ఎటువంటి హాని కలగకుండా గ్లౌజులు ధరించి చేస్తానని పేర్కొంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..