Watch Video: ఓరేయ్ ఏంట్రా మీ పిచ్చి వేషాలు.. కారుపై వెళ్తుండగానే పుష్‌అప్స్.. వీడియో వైరల్

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకన్నా, చలాన్లు విధించినా కూడా కొంతమందిలో మాత్రం తీరు మారడం లేదు. చట్టాలకు, పోలీసులకు ఏ మాత్రం భయపడకుండా తమ ఇష్టం వచ్చినట్లు వేగంగా వాహనాన్ని నడపడం, వింత చేష్టలకు పాల్పడటం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

Watch Video: ఓరేయ్ ఏంట్రా మీ పిచ్చి వేషాలు.. కారుపై వెళ్తుండగానే పుష్‌అప్స్.. వీడియో వైరల్
Man Doing Push Ups On Car

Updated on: May 31, 2023 | 5:18 PM

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకన్నా, చలాన్లు విధించినా కూడా కొంతమందిలో మాత్రం తీరు మారడం లేదు. చట్టాలకు, పోలీసులకు ఏ మాత్రం భయపడకుండా తమ ఇష్టం వచ్చినట్లు వేగంగా వాహనాన్ని నడపడం, వింత చేష్టలకు పాల్పడటం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న కారుపై పుష్‌అప్స్ చేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే హర్యానాలోని ఓ ఆల్టో కారు రాత్రి హవైపే వెళ్తోంది. ఆ కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మద్యం సేవించి హల్‌చల్ చేశారు.

కారు వెళ్తుండగానే ముగ్గురు యువకులు కారు కిటికీ అద్దాలపై కూర్చొని హంగామా చేశారు. మరో యువకుడు కారుపైన ఏకంగా పుష్‌అప్స్ చేశాడు. అతని స్నేహితులు కూడా ప్రోత్సహించడంతో అతడు మరింత రెచ్చిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చివరికి ఈ వీడియో గురుగ్రామ్ పోలీసుల దృష్టికి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ కారుపై ఏకంగా రూ.6,500 జరిమాన విధించారు. అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకుని వాహనం యజమాని లోకేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..