Guinness Book: గిన్నిస్ బుక్ లోకి ఆరు అడుగుల ‘రోమియో’! వీడియో చూస్తే అవాక్కే..

|

May 26, 2024 | 8:49 PM

ఇప్పుడు దాని భారీ ఆకారంతోపాటు అందమైన రూపం, తెలివితేటలు రోమియో పేరుకు తగ్గట్లుగానే సరిపోయాయని పేర్కొంది. రోమియో తిండి ఖర్చు కోసం విరాళాలు సేకరిస్తుంటామని దానికి ఆహారం అందిస్తున్న మహిళ మిస్టీ మూర్ వెల్లడించింది.

Guinness Book: గిన్నిస్ బుక్ లోకి ఆరు అడుగుల ‘రోమియో’! వీడియో చూస్తే అవాక్కే..
World's Tallest Bull
Follow us on

రోమియో అనే ఎద్దు సరికొత్త రికార్డు సృష్టించింది. అమెరికాలోని ఓరెగావ్ రాష్ర్టంలో ఉన్న జంతు సంరక్షణశాలలో సేదతీరుతున్న రోమియో అనే ఆరేళ్ల హోల్ స్టీన్ జాతి ఎద్దు సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఆరు అడుగుల 4.5 అంగుళాల ఎత్తు వరకు ఎదిగి ప్రపంచంలోనే ఎత్తయిన ఎద్దుగా నిలిచింది. ఇప్పటివరకు టామీ అనే మరో ఎద్దు పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. టామీకన్నా మూడు అంగుళాలు ఎక్కువ ఎత్తు పెరిగి టామీ రికార్డును బ్రేక్‌ చేసింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ నిర్వాహకులు రోమియో తాజా వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఎద్దు ప్రశాంతంగా, సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఎద్దును చూసిన జనాలు ఫిదా అవుతున్నారు.

రికార్డ్ ఏజెన్సీ ప్రకటనతో పాటు ఒక వీడియోను కూడా షేర్ చేసింది. ఇప్పుడు ఈ రోమియో బుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఎద్దుకు ఓ మహిళ అరటిపండు తినిపిస్తున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. రోమియోకి యాపిల్స్, అరటిపండ్లు అంటే చాలా ఇష్టం అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది. రొమియో ప్రతిరోజూ 100 పౌండ్ల అంటే 45 కిలోల ఎండుగడ్డి తింటుందని చెప్పారు. రోమియో భారీ సైజు వల్ల సాధారణ వాహనాల్లో దీన్ని తరలించడం సాధ్యంకాదని చెప్పారు. అందుకే ప్రత్యేక వాహనాల్లో ఆ ఎద్దును తరలిస్తారని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, గతంలో రోమియో 10 రోజుల వయసులో ఉండగా, దాన్ని కొందరు వధించేందుకు కబేళాకు తరలించిగా, ఈ విషయం తెలిసి ఓ వ్యక్తి దాన్ని కాపాడాడు. ఇప్పుడు దాని భారీ ఆకారంతోపాటు అందమైన రూపం, తెలివితేటలు రోమియో పేరుకు తగ్గట్లుగానే సరిపోయాయని పేర్కొంది. రోమియో తిండి ఖర్చు కోసం విరాళాలు సేకరిస్తుంటామని దానికి ఆహారం అందిస్తున్న మహిళ మిస్టీ మూర్ వెల్లడించింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి