
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లిరోజు చాలా ప్రత్యేకమైనది. ఇద్దరి జీవితాలలో కొత్త ఆధ్యయనం ప్రారంభమవుతుంది. స్నేహితుల అల్లరి.. బంధువుల హడావిడి మధ్య ఎంతో ఘనంగా జరుగుతుంది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోస్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అందులో కొన్ని ఆశ్చర్యంగా ఉంటే.. మరికొన్ని నవ్వులు పూయిస్తుంటాయి. అలాగే కొన్ని పెళ్లి వీడియోస్ మనసును తాకుతాయి. కానీ తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మాత్రం పడి పడి నవ్వేస్తారు. ఎంతో ఆసక్తిగా వధువు కోసం ఎదురుచూస్తున్న వరుడికి అతడి బెస్ట్ ఫ్రెండ్ షాకిచ్చాడు. అతడు చేసిన పని చూసి ఆ వరుడు ఆశ్చర్యపోయి.. ఆ తర్వాత పగలబడి నవ్వేశాడు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా.
వరుడు ఎంతో ఆసక్తిగా తన కాబోయే భార్య కోసం ఎదురుచూస్తున్నాడు. అతని వెనక నుంచి పొడవాటి గౌను ధరించి అచ్చం వధువులా తయారయిన ఓ వ్యక్తి వచ్చి వరుడి వెనక నిల్చున్నాడు. తన భార్య కోసం ఎదురుచూస్తున్న పెళ్ళికుమారుడు సంతోషంతో వెనక్కు తిరిగి చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. ఆ తర్వాత తెరుకుని పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు. ఎందుకంటే వధువుగా వచ్చింది అతని బెస్ట్ ఫ్రెండ్. తన స్నేహితుడిని ఆటపట్టించేందుకు వధువుగా డ్రెస్సింగ్ చేసుకుని వచ్చాడు. తన ప్రాణస్నేహితుడిని వధువుగా చూసిన వరుడు ముందుగా షాకయ్యాడు. ఆ తర్వాత అతడిని గట్టిగా పట్టుకుని నవ్వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను వెడ్డింగ్ వైర్ అనే ఇన్ స్టా యూజర్ షేర్ చేయగా.. నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.