మరదళ్ల మజాకా..! కొత్తపెళ్లికొడుక్కి అవాక్కయ్యే కానుకలు..! భలే బామ్మర్దులు ఏం చేశారంటే..

|

May 30, 2022 | 12:38 PM

వివాహ వేడుకంటేనే ఓ పెద్ద పండగ, సందడి, సంబరం, హంగామా. బంధువుల ఆటలు, పాటలు.. అమ్మాయిలు అబ్బాయిలు చేసుకునే జోక్స్..వేసుకునే పందాలు.. ఒకటి ఏంటి పెళ్లి తంతు ముగిసే వరకు ఒక పెద్ద ఉత్సవమే..

మరదళ్ల మజాకా..! కొత్తపెళ్లికొడుక్కి అవాక్కయ్యే కానుకలు..! భలే బామ్మర్దులు ఏం చేశారంటే..
Grooms Brothers
Follow us on

Wedding Viral Video: వివాహ వేడుకంటేనే ఓ పెద్ద పండగ, సందడి, సంబరం, హంగామా. బంధువుల ఆటలు, పాటలు.. అమ్మాయిలు అబ్బాయిలు చేసుకునే జోక్స్..వేసుకునే పందాలు.. ఒకటి ఏంటి పెళ్లి తంతు ముగిసే వరకు ఒక పెద్ద ఉత్సవమే.. ఇకపోతే, పెళ్లి మొత్తంలో బావ-మరదళ్లు, బావ-బామ్మర్దుల మధ్య జరిగే సన్నివేశాలు ఎంత కామెడీగా ఉంటాయో మనం తరచూ చూస్తూనే ఉంటాం. మరదళ్లు అంటేనే బావను సరదాగా ఆటపట్టిస్తూ, ఏడిపిస్తూ… భలేగా ఉంటుంది ఆ అల్లరి. అక్కడ వేడుక ఏదైనా బావ-మరదళ్ల అల్లరి మాములుగా ఉండదు. అందరి ముందు ఉత్సాహంతో డ్యాన్స్ లు, జోక్స్ తో ఆ ప్రదేశం మారిపోతుంది. అయితే ప్రతి రోజు ఇలాంటి పెళ్లిళ్లకు సంబంధించి ఏదొక ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా నెట్టింట్లో చేరిన మరో పెళ్లి వీడియో తెగ ఆకట్టుకుంటుంది.

ఇక్కడ వీడియోలో కూడా ఓ కొత్త జంట వివాహ రిసెప్షన్‌ జరుగుతోంది. వేదికపై వధూవరులు సంతోషంగా కనిపిస్తుంటారు. అంతలోనే దిగుతుంది అల్లరి మూక..అదేనండి బామ్మర్దులు, మరదళ్ల దండు..వారి రాకతో ఇక ఆ పెళ్లి వేదికగా ఒక్కసారిగా సరదాలతో నిండిపోతుంది. ఇక మరదళ్లు ఒక్కోక్కరు టిప్పుటాపుగా ముస్తాబై…కొత్త బావకు ఒక్కో మరదలు ఒక్కో బహుమతి పట్టుకుని తెగ తిప్పుకుంటూ వస్తున్న దృశ్యాలు మనం వీడియోలో చూడొచ్చు..వరుడికి వాళ్లు ఇచ్చిన గిఫ్ట్స్‌ చూస్తే..కడుపు చెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే. ముందుగా ఒకరు మసిబట్టను అంటే వంటింట్లో ఉపయోగించే నాప్కిన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ తర్వాత మరో యువతి ఏకంగా ఇళ్లు కడిగేందుకు వాడే వైపర్‌ను గిఫ్ట్‌గా ఇస్తుంది…మరోకరు చీపురు, చెత్తచాట, రొట్టెల కర్ర ఇలా అన్నీ వంట్టింటి వస్తువలే తీసుకొచ్చారు. ఇది చూసి వధూవరులతో సహా పెళ్లికి వచ్చిన అతిథులు, స్నేహితులు అందరూ కూడా తెగ నవ్వుకున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే, సాధారణంగా ఇలాంటి జోక్‌ని పెళ్లికొడుకు స్నేహితులు చేస్తుంటారు..కానీ, ఇక్కడ కోడలి తరపుబంధువులు చేయటంతో అందరూ కొత్తగా వింత అనుభూతిని పొందారు. వరుడు సైతం పాపం ఏ మాత్రం విసుగుచెందకుండా ముసిముసి నవ్వులతో ఎంజాయ్‌ చేసినట్టు వీడియోలో చూడొచ్చు..

సోషల్ మీడియాలో ఈ వీడియోని జనాలు బాగా లైక్ చేస్తున్నారు. వెడబౌట్ అనే ఖాతా ద్వారా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోను షేర్‌ చేస్తూ..కొత్త అల్లుడు పరిపూర్ణ భర్తగా మారడానికి మరదళ్లు తమ బావను సిద్ధం చేస్తున్నారు’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఇకపోతే, వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.