- Telugu News Photo Gallery Cinema photos Actress anupama parameshwaran shares about her love and marriege releationship status
Anupama Parameswaran: నేను ప్రేమలో ఉన్నాను.. కానీ.. షాకింగ్ కామెంట్స్ చేసిన అనుపమ..
ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది కేరళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అచ్చమైన తెలుగింటి ఆడపిల్లగా కనిపించి మెప్పించింది.
Updated on: May 30, 2022 | 12:33 PM

ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది కేరళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అచ్చమైన తెలుగింటి ఆడపిల్లగా కనిపించి మెప్పించింది.

ప్రస్తుతం తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. అందం, అభినయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తాను ప్రేమలో ఉన్నానంటూ చెప్పుకొచ్చింది ఈ చిన్నది.

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిలేషన్ షిప్ స్టేటస్ పై ఆసక్తికర విషయాలను బయటపెట్టింది ఈ చిన్నది. తాను పెళ్లంటూ చేసుకుంటే ప్రేమ వివాహమే చేసుకుంటానని కుండబద్దలు కొట్టారు..

అనుపమ మాట్లాడుతూ.. నాకు ప్రేమ వివాహం పై సదాభిప్రాయం ఉంది.. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్ని చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. నాక్కూడా ప్రేమ పెళ్లే చేసుకోవాలని ఉంది.. మా ఇంట్లో వాళ్లకి కూడా ఈ విషయం తెలుసు..

నేను పెళ్లి చేసుకుంటే అది తప్పకుండా ప్రేమ పెళ్లే అవుతుంది. అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ మీరు ప్రేమలో ఉన్నారా ? లేదా సింగిలా ? అని అడగ్గా.. తాను సింగిల్ కాదు మింగిల్.. ఏం చెప్పాలో అర్థం కావడం లేదని తెలిపింది.

ఎందుకంటే నా రిలేషన్ షిప్ స్టేటస్ నాక్కూడా సరిగ్గా తెలియడం లేదు.. నేనైతే ప్రేమలో ఉన్నా.. మరి అవతలి సైడ్ నుంచి ఏమనుకుంటున్నారో తెలియదు.. కాబట్టి వన్ సైడ్ లవ్ అని చెప్పగలను అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే తనపై సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ అప్పుడప్పుడూ ఫాలో అవుతుంటానని.. వాటిని చూసి నవ్వుకుంటానని.. తనపై ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది అనుపమ..

నేను ప్రేమలో ఉన్నాను.. కానీ.. షాకింగ్ కామెంట్స్ చేసిన అనుపమ..





























