పెళ్లి గురించి ప్రతి ఒక్కరు ఎన్నో ఆలోచనలు చేస్తుంటారు. ముఖ్యంగా తమ జీవితంలోకి రాబోయే భాగస్వామి గురించి ఎన్నో కలలు కంటారు. అది అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా.. తమ లైఫ్ పార్టనర్ పై ఎన్నో ఆశలు.. ఊహలతో ఆత్రతుగా వెయిట్ చేస్తారు. ఇక ఎంతో కాలం ప్రేమించిన తర్వాత తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువచ్చిన జంటల ఆనందం గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల పెళ్లిల్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని నవ్వులు పూయిస్తుండగా.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా ఓ పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అందులో పెళ్లి కూతురును చూడగానే వరుడు చేసిన పనికి అక్కడున్నవారంత షాకయ్యారు.
ఆ వీడియోలో పెళ్లి కూతురు ఎంతో అందంగా ముస్తాబై.. పెళ్లి మండపానికి చేరుకుంది. అప్పటికే అక్కడ వధువు కోసం ఎంతో ఆసక్తిగా ఉన్న వరుడు.. ఆమె చూడగానే ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎంతో కాలంగా వెయిట్ చేసిన ఆ తర్వాత తన జీవితంలోకి మధురమైన రోజు రావడంతో వరుడు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈవీడియోను ఆకాశకరివాలా అనే ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తూ.. నువ్వు నాకు తెలిసిన రోజు నుంచి నేను ఒక్క క్షణం కూడా నిరాశగా గడపలేదు. మేము ఈ 5 సంవత్సరాలలో ఎంతో ఆనందక్షణాలను గడిపాము.. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. ఈ రోజు వరకు ఎలా చేరమనేది. నువ్వు నా చిరునవ్వు..నన్ను ఎప్పటికీ సంతోషపరుస్తావు.. ప్రతిరోజు నా వెంటే ఉండి.. నాలోని భయాలను పోగొట్టినందుకు.. అలాగే నాతోపాటు నడిచే అదృష్ట వ్యక్తిగా నన్ను భావించేలా చేసిందుకు ధన్యవాదాలు.. ఎట్టకేలకు 5 సంవత్సరాల తర్వా మన వివాహం జరిగింది.. ఇది చాలా అద్భుతంగా అనిపిస్తుంది.. సక్సెస్ అంటూ రాసుకోచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Keerthy Suresh: కీర్తి సురేష్ కొత్త అవతారం.. ఆ హీరోతో కలిసి లాయర్‍గా మారిన మహానటి..
Skin Care: మీ చర్మం తరచూ పొడిబారుతుందా ? అయితే మీకు ఈ వ్యాధులు ఉన్నట్లే.. ఏంటంటే..
AP Crime News: అయ్యో ఇంత ప్రేమనా..? కుక్క చనిపోయిందని యజమాని కూడా..