చాలా మంది ఇళ్లల్లో కుక్క, పిల్లి వంటి జంతువులను ఎక్కువగా పెంచుకుంటుంటారు. వాటిని తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ప్రేమిస్తుంటారు. అలాగే, ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లులకు సీమంతాలు, బారసాల, పుట్టిన రోజులు కూడా జరిపిస్తుంటారు. అలాంటి వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. బర్త్‌డే పేరిట కేక్ కట్ చేయడం, సీమంతంలో వాటికి అచ్చం ఆడవాళ్లకు జరిపినట్టుగా బొట్టు గాజులతో వేడుక నిర్వహిస్తారు. అందుకు సంబంధించి ప్రతి ఒక్కదాన్ని షూట్చేసి పోస్ట్ చేస్తుంటారు. అలాగే, కొందరు ఆవులకు కూడా ఇలాంటి అన్ని వేడుకలు నిర్వహిస్తుంటారు. తాజాగా ఓ ఆవు దూడకు జరిగిన బారసాల వేడుక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా పుట్టిన పిల్లలకు బారసాల నిర్వహించి ఊయలలో వేస్తుంటారు. అయితే ఆవు దూడను ఊయలలో వేయడం ఎప్పుడైనా చూశారా? అవును, దూడను చిన్న పిల్లాడిలా లాలిస్తూ ఊయల లాడించారు. దీనికి సంబంధించిన క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యం ఇప్పుడు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.
కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలోని అనంతకృష్ణ గోశాలలో దూడకు అంగరంగ వైభవంగా ఊయల కార్యక్రమం నిర్వహించారు. ఈ వీడియోను ఆదర్శ్ హెగ్డే (adarshahgd) తన X ఖాతాలో షేర్ చేశారు. మంత్రాలు పఠిస్తూ దూడను పసిపాపలా ఊయలలో ఉంచి దానికి నామకరణం కూడా చేశారు.
A new born calf was welcomed like this by their Yajamana and his family 🙂 pic.twitter.com/jxBjZ99rPG
— Adarsh Hegde (@adarshahgd) January 9, 2025
జనవరి 9న షేర్ చేయబడిన ఈ వీడియోకు 95,000 వ్యూస్ వచ్చాయి. ప్రజలు చాలా మంది దీనిపై అందమైన కామెంట్‌లు కూడా చేశారు. అద్భుతం అంటూ కొందరు రాయగా, ఆవులను కుటుంబ సభ్యులుగా భావించే సంస్కృతి మన దేశంలోనే సాధ్యమవుతుందని ఇంకొకరు కామెంట్ రాశారు. చాలా మంది ఈ వేడుకను చూసి ముచ్చటపడుతూ ప్రశంసించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి