Viral Photo: ఈ ఫోటోలోని టీనేజర్ ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు.. ఎవరో గుర్తుపట్టారా..?

|

Dec 04, 2021 | 10:13 AM

ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎదిగిన వైనం. ఆటుపోట్లు దాటి ముందుకు సాగిన ప్రయాణం. ప్రస్తుత యువతకు ఆయన జీవితం ఎంతో ఆదర్శం.

Viral Photo: ఈ ఫోటోలోని టీనేజర్ ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు.. ఎవరో గుర్తుపట్టారా..?
Google Ceo
Follow us on

ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎదిగిన వైనం. ఆటుపోట్లు దాటి ముందుకు సాగిన ప్రయాణం. ప్రస్తుత యువతకు ఆయన జీవితం ఎంతో ఆదర్శం. సుందర్ పిచాయ్.. ఇది పేరు కాదు.. ఓ బ్రాండ్. ఈ చెన్నై వ్యక్తి.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రముఖ ఐటీ కంపెనీకి మార్గనిర్దేశకుడు అయ్యారు. గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్‌కు సీఈవోగా రాణిస్తున్నారు. 1972లో తమిళనాడులోని మదురైలో పుట్టారు సుందర్ పిచాయ్. ఆయన తండ్రి ఓ ఎలక్ట్రికల్ ఇంజినీర్. ఆయన తల్లి ఓ స్టెనోగ్రాఫర్.  చిన్నప్పుడు సాదా సీదా జీవితం గడిపినట్లు పిచాయ్ స్వయంగా చెప్పారు. అద్దింట్లో కుటుంబంతో కలిసి నివశించేవాడిని తెలిపారు. పిచాయ్ చిన్నప్పటి నుంచే చదువుల్లో రాణించి.. నంబర్ వన్ అనిపించుకునేవారు.  ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌ చేసిన పిచాయ్.. అక్కడే పరిచయమైన అంజలిని వివాహం చేసుకున్నారు.  అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీలో ఎంఎస్‌ చేశారు.  2004లో గూగుల్‌లో చేరిన పిచాయ్… కీలకమైన క్రోమ్‌ బ్రౌజర్‌ ప్రాజెక్టును సక్సెస్ చేశాక కంపెనీలో వేగంగా ఎదిగారు.  ఆయన పనితీరు వల్ల అల్ఫాబెట్‌ ప్రాజెక్టులూ ఆయన పరిధిలోకి వచ్చాయి. టెక్నాలజీపై ఉన్న అపారమైన పరిజ్ఞానంతో పాటు కఠినత్వం అన్నదే లేకుండా మాట్లాడటం.. ఉద్యోగుల్లో స్పూర్తి నింపడం.. ఎలాంటి కఠిన పరిస్థితుల్లో అయినా నిబద్ధతతో వ్యవహరించడం వంటి గుణాలే ఆయన ఎదుగుదలకు కారణమని సన్నిహితులు చెబుతారు.

కాగా ప్రస్తుతం సుందర్‌ పిచాయ్‌ టీనేజ్ ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. తల్లిదండ్రులతో కలిసి ఓ పర్యాటక ప్రాంతంలో ఈ ఫోటో దిగినట్లు అర్థమవుతోంది. ఈ ఫోటోలో పిచాయ్‌ను చూసిన నెటిజన్లు ఆయన్ను గుర్తించలేపోతున్నారు. ‘సరిలేరు ‘సుందర్‌’కెవ్వరు..!’ అని కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: Viral Photo: ఈ ఫోటోలో ఓ పాము దాగుంది.. కనిపెట్టండి చూద్దాం