సోషల్ మీడియాలో అనేక రకాల వింత వీడియోలు, విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రతినిత్యం వైరల్ అవుతుంటాయి. అలాంటిదే తాజాగా ఓ వింత వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ ఇంటి బాత్‌రూమ్ గోడ టైల్స్ పగలగొట్టి చూడగా బంగారు నాణేల వర్షం కురిసింది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టి చూస్తున్నారు. ఇదేలా సాధ్యం అంటూ ప్రజలు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
వైరల్ వీడియోలో ఓ వ్యక్తి బాత్రూంలో టైల్స్ వేసి ఉన్న ఓ గోడను సుత్తీ తీసుకుని పగులగొడుతుంటాడు. టైల్స్‌ను పగులగొట్టి చూడగా లోపల వారికి కళ్లు జిగేల్‌మనిపించే దృశ్యం కనిపించింది. గోడలోపల ఓ ఐరన్ బాక్స్ లాంటిది కనిపించింది. అందులో నుంచి బంగారు కాయిన్స్ కిందపడ్డాయి.. దానిని చూడగానే ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరింత వెడల్పుతో గోడకు ఉన్న టైల్స్‌ను అన్ని తొలగించి ఆ పెట్టెకు లాక్ ఉండడంతో పాటూ దానిపై నంబర్లు కూడా ఉన్నాయి. అతి కష్టం మీద అతను దాన్ని బయటకు తీసి నేలపై పడేశాడు. ఎలాగోలా దాన్ని పగుల గొట్టాడు. లోపల కరెన్సీ నోట్లు కూడా కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు పెట్టె తలుపు తెరిచి చూడగా అందులో కరెన్సీ నోట్లు, బంగారు, వెండి ఆభరణాలు, ఫొటో, మొబైల్ ఫోన్ ఉన్నాయి. అదనంగా, మరొక చిన్న పెట్టెను పగలగొట్టడం వల్ల వజ్రాలు, నగదు, చిన్న తుపాకీ లభిస్తుంది.
వీడియో ఇక్కడ చూడండి..
అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది నకిలీ బంగారం.. వ్యూస్ కోసం ఇదంతా చేశారంటూ వ్యాఖ్యనిస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 40 లక్షలకు పైగా లైక్‌లు, కోట్లాది వీక్షణలు వచ్చాయి. అది నిజమో, అబద్ధమో, ఈ రీల్స్‌ని అప్‌లోడ్ చేసిన వ్యక్తి చాలా ఫేమస్ అయ్యాడు. ఎందుకంటే ఇప్పటి వరకు కోట్ల మంది చూశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..