Gold In Liquid Form Trees: బంగారం కోసం.. బొగ్గు కోసం, భూమిని తెగ తవ్వేస్తుంటారు. దీనివల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. అయితే ఇలా తవ్వకుండానే.. చెట్ల నుంచి బంగారం వస్తుందన్న విషయం మీకు తెలుసా..? అవును.. ఆ ప్రదేశంలో చెట్ల నుంచే బంగారాన్ని తీస్తుంటారు. ఎలాగా అని అనుకుంటున్నారా.. జిగురు ద్వారా బంగారాన్ని తీస్తారు. స్పెయిన్లో టియర్రా డి పినారెస్, సియర్రా డి గ్రెడోస్ పర్వతాల మధ్య.. 4,00,000 హెక్టార్ల విస్తీర్ణంలోని పైన్ వృక్షాలతో నిండిన అటవీ ప్రాంతం ఉంటుంది. సూర్య కిరణాలు కూడా చొరబడలేనంత ఈ దట్టమైన అడవులలో సందర్శించేందుకు స్థానికులు, సందర్శకులూ తెగ ఇష్టపడుతుంటారు. అయితే.. ఇక్కడ నివసిస్తున్న వారు కొన్ని దతాబ్దాల నుంచి పైన్ చెట్ల ద్వారా ద్రవ రూపంలోని బంగారం జిగురిని సేకరిస్తున్నారు. పైన్ చెట్ల నుంచి జిగురును వెలికి తీసే అలవాటు కొన్ని శతాబ్దాలుగా ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ప్రాచీన అలవాటు భూమికి మేలు చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలను సంరక్షిస్తుందని స్పెయిన్‌లోని ప్రజలు భావిస్తారని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
స్పెయిన్ వాయువ్య భాగంలో విస్తరించి ఉన్న కాస్టిల్లా వై లీయోన్ ప్రాంతం పర్వత శ్రేణులు, ఎత్తైన పీఠభూములు, మధ్యయుగం నాటి పట్టణాలతో మమేకమై ఉంటాయి. అయితే.. ఈ జిరుగును స్పెయిన్‌లో, మధ్యధరా ప్రాంతాల్లో.. నౌకలను వాటర్ ప్రూఫ్ చేసేందుకు, గాయాలకు చికిత్సగా, కాగడాలు వెలిగించేందుకు వాడుతుంటారు. కానీ కాస్టిల్లా వై లీయోన్ ప్రాంతంలో పైన్ చెట్ల నుంచి జిగురును సేకరించడం 19, 20వ శతాబ్దాల వరకూ కూడా లాభదాయకం కాలేదని మాడ్రిడ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలెజాన్డ్రో చోహాస్ పేర్కొన్నారు. 19వ శతాబ్దం మధ్యలో ఈ చెట్ల నుంచి తీసే జిగురుతో ప్లాస్టిక్, వార్నిష్, టైర్లు, జిగురు, రబ్బరు, టర్పెంటైన్ తయారు చేసేవారు. ఆ తర్వాత పైన్ అడవుల యజమానులు ఈ విలువైన ద్రవం అవకాశాన్ని గ్రహించి.. కార్మికులను తీసుకొచ్చి సేకరించడం మొదలుపెట్టారు.
చెట్ల నుంచి జిగురు సేకరించే పని కాస్టిల్లా వై లీయోన్ ప్రాంతంలో గత పదేళ్లలో పుంజుకుంది. యూరప్‌లో ఎక్కడా లేనంతగా ఈ ప్రాంతంలో రెసిన్ ఉత్పత్తిదారులు ఉన్నారు. ఇప్పటికీ చెట్ల నుంచి జిగురును సేకరిస్తున్న పనిని కొనసాగిస్తున్నారు. అయితే.. రేసిన్ ను తీసే క్రమంలో చెట్లను గొడ్డళ్లతో కొట్టడంతో అవి చనిపోతున్నాయి. దీంతో ఇప్పుడు చెట్లకు గాట్లు పెట్టి జిగురును తీస్తున్నారు. గాట్లు పెట్టి.. రెసిన్ ను ఒక కుండ ద్వారా సేకరిస్తారు. ఆ తర్వాత జిగురిని ఫ్యాక్టరీలకు పంపి డిస్టిలేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. అందులో ఉండే టర్పెంటైన్‌ను వెలికి తీసిన అనంతరం ఇది పసుపు రంగులోకి మారి గట్టిగా మారిపోతుంది. అప్పుడిది మెరిసే పసుపు వర్ణంలో ఉండే రాయిలా తయారవుతుంది. ఆ తర్వాత బంగారాన్ని వ్యాపారస్థులు విక్రయిస్తుంటారు.
Also Read: