కేజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. విడుదలైన మొదటి రోజే కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఏప్రిల్ 14న విడుదలైన కేజీఎఫ్ 2 మూవీ నెల రోజులు గడుస్తున్నా.. వసూళ్ల వేట కొనసాగిస్తుంది. ఇప్పటివరకు రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు చేసి పాన్ ఇండియా లెవల్లోనే అత్యంత కలెక్షన్లు రాబట్టిన నాల్గవ చిత్రంగా.. దక్షిణాది నుంచి మూడవ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో యశ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. కేజీఎఫ్ 2లో యశ్ నటనకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా యూత్‌లో యశ్‌కు ఫాలోయింగ్ పెరిగిపోయింది. యశ్ అద్భుతమైన నటన.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ విజువల్ ఎఫెక్ట్‌కు సినీ ప్రియులు ముగ్దులయ్యారు. ఇప్పటికీ కేజీఎఫ్ 2 హావా కొనసాగుతుంది. తాజాగా ఓ అమ్మాయి తన స్నేహితులతో కలిసి యశ్ పై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటి చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది..
అందులో పూజా ప్రకాష్ బస్మే అనే అమ్మాయి ముందుగా తనకు పరిసరాల్లో కంట్రస్టక్షన్ అవుతున్న భవనం వద్ద నుంచి కొద్ది మొత్తంలో కంకరను తీసుకొచ్చింది.. ఆ తర్వాత నెలపై చాక్ పీస్తో యశ్ చిత్రాన్ని గీసింది. ఆ తర్వాత కంకరకు కొద్దిగా నలుపు రంగు వేసి.. పూర్తిగా కంకరతోనే దాదాపు 13.5 అడుగుల యశ్ చిత్రాన్ని అద్భుతంగా నెలపై వేసింది. యశ్ చిత్రాన్ని డ్రోన్ సహయంతో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోను కేజీఎప్ 2 అఫీషియల్ ఇన్ స్టా ఖాతాలో షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ సూపర్బ్.. అద్భుతం.. చాలా కష్టపడ్డావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Actor Vijay Babu: అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తప్పుకున్న హీరో.. ఎందుకంటే..
Keerthy Suresh: సర్కారు వారి పాట కోసం ఎదురుచూస్తున్నాను.. ఆసక్తికర పోస్ట్ చేసిన కీర్తి సురేష్..
RC 15: డైరెక్టర్ శంకర్ భారీ ప్లాన్.. చరణ్ సినిమాలో హైలేట్ అవే.. కొత్త షెడ్యూల్ అప్పుడే స్టార్ట్..
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమాలో మహేష్‌కు ఆ సాంగ్ ఇష్టం.. రచయత అనంత్ శ్రీరామ్..