Viral: వామ్మో.. ఏకంగా HIV రక్తాన్ని ఎక్కించుకున్న యువతి.. ఎందుకో తెలిస్తే షాకే!
ప్రేమ.. ఈ రెండక్షరాలు ఎంతకైనా తెగిలించేలా చేస్తాయి. అడ్డొచ్చిన వారిని చంపేలా చేస్తాయి.. లేదా తమను తాము..
ప్రేమ.. ఈ రెండక్షరాలు ఎంతకైనా తెగిలించేలా చేస్తాయి. అడ్డొచ్చిన వారిని చంపేలా చేస్తాయి.. లేదా తమను తాము చంపుకునేలా చేస్తాయి. అయితే ఇక్కడొక యువతి.. ప్రేమ కోసం ఎంత పని చేసిందో తెలిస్తే మీ ఫ్యూజులు ఎగరడం ఖాయం. ఆ కథేంటంటే..
వివరాల్లోకి వెళ్తే.. అసోంలోని సువల్‌కచి గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి.. తన పక్క గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. మొదట వీరిరువురూ ఫేస్‌బుక్‌లో పరిచయం కాగా.. ఆ తర్వాత కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. ఎంతగా అంటే ఒకరినొకరు వదులుకోలేనంతగా ప్రేమలో మునిగి తేలారు. అయితే అనూహ్యంగా ఆ యువకుడు కొద్దినెలల క్రితం హెచ్ఐవీ బారిన పడ్డాడు.
తన ప్రియుడు హెచ్ఐవీ బారినపడ్డ.. అతడ్ని వదులుకోలేకపోయిన ఆ యువతి.. అతడితో కలిసి మూడుసార్లు పారిపోవాలని ప్రయత్నించింది. అయితే ఆమె కుటుంబసభ్యులు ఎక్కడికి వెళ్లినా.. వెతికి మరీ వెనక్కి తీసుకొచ్చారు. దాన్ని తట్టుకోలేకపోయిన ఆ యువతి.. షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆమె తన ప్రియుడి హెచ్ఐవీ రక్తాన్ని సిరంజి సాయంతో తన శరీరంలోకి ఎక్కించుకుంది. తన ప్రియుడి నుంచి తనను ఎవ్వరూ దూరం చేయకూడదనే ఉద్దేశ్యంతో తాను ఈ పని చేశానని.. ఇకపై తనను ఎవ్వరూ తన లవర్ నుంచి దూరం చెయ్యలేరని ఆమె మీడియాతో చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబసభ్యులు.. ఆ యువకుడ్ని జైలులో పెట్టించారు. అతడి ప్రియురాలి.. తన ప్రియుడ్ని విడిచిపెట్టాలని కోరింది.