Viral Video: పానీపూరీలో మంట.. మింగి తంటాలు పడిన యువతి.. వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వడం ఖాయం..
ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నో విచిత్ర వంటకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. రోజూ చేసే వంటకాలకు కాస్త విభిన్నంగా
ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నో విచిత్ర వంటకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. రోజూ చేసే వంటకాలకు కాస్త విభిన్నంగా ప్రయత్నిస్తూ పలు కొత్త వంటలను ట్రై చేస్తున్నారు చాలా మంది. చాక్లెట్ సమోసా.. టమోటా కచోరి, ఐస్ క్రీన్ కచోరి, పుచ్చకాయ మిల్క్ షేక్.. ఇలా ఒక్కటేమిటీ ఎన్నో రకాలు వంటకాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సరికొత్త వంటకం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదే పానీ పూరిలో అగ్ని. వింటుంటే కాస్త్ కొత్తగా ఉంది కదా.. పానీపూరిలో అగ్ని పెట్టి కస్టమర్లకు ఇస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అదెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆ షాపు యాజమాని పానీపూరిలో అగ్ని పెట్టి అక్కడే ఓ యువతికి ఇచ్చాడు. పానీపూరిలో మంట ఉన్న సమయంలోనే ఆ యువతి తినేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ పానీపూరి అగ్ని వీడియో అహ్మదాబాద్ లో జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ విచిత్ర వంటకాన్ని చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరు చూసేయ్యండి.
View this post on Instagram
Shilpa Chowdary Cheating Case: కిలాడీ లేడీ శిల్పా చౌదరి కేసులో కొత్త ట్విస్ట్.. తెరమీదకు మరో పేరు..
Upasana Kamineni Konidela: రెండు సింహాలను దత్తత తీసుకున్న రామ్ చరణ్ సతీమణి ఉపాసన..