నార్మల్ గా కప్ప కనిపించగానే చాలామంది… అక్కడ నుంచి వెంటనే పక్కకు దూకేస్తారు. అది ఏం చేయదు.. కానీ జనాలకు అదోరకం జలదరింపు ఉంటుంది. చాలామంది దానిని చూసి అసహ్యించుకుంటారు. అయితే ఇప్పటివరకు మీకు తెలిసిన కప్ప ఎంత సైజ్ ఉంటుంది..? మహా అయితే కొన్ని అంగుళాలుంటుంది. వర్షకాలం చెరువుల్లో కనిపించే పసుపురంగు కప్పలైతే ఇంకాస్త పెద్దవిగా ఉంటాయి. . కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కప్ప ఏకంగా అడుగున్నర ఉంటుంది. అంటే చంటిబిడ్డంత సైజన్నమాట. అంతేకాదు ఇది దాదాపు కిలోకు పైగా బరువుంది. అయితే ఈ భారీ కప్పను తాజాగా సోలమాన్ దీవుల్లో గుర్తించారు. ఆ దీవుల్లోని హొనియారా ప్రాంతపు శివార్లలో స్థానిక ప్రజలకు ఈ కప్ప దొరికింది. పందులను వేటాడేందుకు వెళ్లిన వారికి ఈ కప్ప కంట పడడంతో వారంతా షాక్ కు గురయ్యారు వెంటనే దానిని పట్టుకుని గ్రామంలోకి తీసుకొచ్చారు. ఆ కప్పను చూసిన గ్రామస్థులంతా కూడా ఆశ్చర్యపోయారు.
కాగా.. ఈ కప్ప సెరేటోబాట్రాచిడే కుటుంబానికి చెందిన కార్నుఫర్ గప్పీ ఫ్రాగ్ జాతికి చెందినదిగా నిపుణులు చెబుతున్నారు. . అయితే ఈ కప్ప అక్కడి స్థానికులకు ఎంతో ఇష్టమట. దీనిని అక్కడి గ్రామస్థుల్లో కొంతమంది ‘బుష్ చికెన్’ అని కూడా సంభోదిస్తారట. చికెన్ కన్నా ఇది టేస్ట్ ఉంటుందని , కానీ ఇది దొరకడం చాలా అరుదు అని అక్కడి వారు చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: అందరూ హ్యాపీగా బాల్కానీలో జబర్దస్త్ పార్టీ.. ఇంతలో ఒక్కసారిగా షాక్.. కెమేరాకు చిక్కిన ఘటన
మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ చేసుకున్నారా ? లేకపోతే.. మీరు రూ. 2 లక్షలు రానట్లే.. ఎలాగో తెలుసా..