Watch: ప్రపంచంలోనే అతిపెద్ద దోసె ఇదేనా..? వీడియోపై నెటిజన్ల రియాక్షన్‌ చూడాల్సిందే..!

|

Sep 09, 2024 | 8:44 PM

ఏ దోశైనా కూడా తింటే చాలు సంతృప్తిగా ఉంటుంది. అలాంటిది ఈ భారీ దోసె చూసిన కొందరు వినియోగదారులు దీనిపై స్పందిస్తూ.. చెన్నై వచ్చి చూడు ఇంకా ఇంతకంటే కూడా పెద్ద దోసెలు దొరుకుతాయని అంటున్నారు. తమిళనాడుకు రండి, మీకు ఇంకా పెద్ద దోసె చూపిస్తాం' అని మరో వినియోగదారు వ్యాఖ్యానించారు.

Watch: ప్రపంచంలోనే అతిపెద్ద దోసె ఇదేనా..? వీడియోపై నెటిజన్ల రియాక్షన్‌ చూడాల్సిందే..!
Giant Dosa
Follow us on

దోశ పుట్టుక గురించి ఇప్పటికి అనేక వాదనలు ఉన్నాయి. కొందరు కర్ణాటకలో దోశ పుట్టిందని చెబితే, మరికొందరు తమిళనాడులో పుట్టిందని అంటారు. కాదు, దోశకు పుట్టినిల్లు కేరళ అని కూడా అంటారు. ఏది ఏమైనప్పటికీ దోస మనకు ఇష్టమైన, ప్రసిద్ధ వంటకం. అయితే ఇప్పుడు ఓ రెస్టారెంట్‌లో తయారు చేసిన భారీ దోసె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోష
ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ Instagramలో షేర్ చేసి ఈ వీడియోకి క్యాప్షన్‌గా ‘ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దోసా?’ అని పేర్కొన్నారు. కాగా, ఈ దోసె దాని ఆకారంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

వైరల్‌ వీడియోలో రెస్టారెంట్‌లో వెయిటర్లు భారీ దోసెలు తీసుకు రావటం కనిపించింది. రెస్టారెంట్‌లోని ప్రతి టేబుల్ మీదా ఈ దోసె వడ్డిస్తున్నారు. ఈ దోసె చూసి చాలా మంది రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇంత పెద్ద దోసె చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. వారి ముఖంలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది దోసె ముట్టుకుని చూస్తుంటే, మరికొంతమంది వడ్డించడం చూస్తున్నారు. ఈ వీడియోపై చాలా మంది తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

దోశ పేరు చెబితేనే కొందరికి నోరూరిపోతుంది. దోశలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఏ దోశైనా కూడా తింటే చాలు సంతృప్తిగా ఉంటుంది. అలాంటిది ఈ భారీ దోసె చూసిన కొందరు వినియోగదారులు దీనిపై స్పందిస్తూ.. చెన్నై వచ్చి చూడు ఇంకా ఇంతకంటే కూడా పెద్ద దోసెలు దొరుకుతాయని అంటున్నారు. తమిళనాడుకు రండి, మీకు ఇంకా పెద్ద దోసె చూపిస్తాం’ అని మరో వినియోగదారు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..