Chameleon Diamond: ‘ఊసరవెల్లి’లా రంగులు మారుస్తున్న అరుదైన వజ్రం.. శాస్త్రవేత్తల ఆశ్చర్యం..

|

Oct 08, 2021 | 8:51 AM

Chameleon Diamond: ప్రపంచంలో నిత్యం ఏదో ఒకటి కొత్తగా ఆవిష్కృతం అవుతూనే ఉంటుంది. తాజాగా శాస్త్రవేత్తలు రంగులు మార్చే వజ్రాన్ని కనుగొన్నారు.

Chameleon Diamond: ‘ఊసరవెల్లి’లా రంగులు మారుస్తున్న అరుదైన వజ్రం.. శాస్త్రవేత్తల ఆశ్చర్యం..
Daimond
Follow us on

Chameleon Diamond: ప్రపంచంలో నిత్యం ఏదో ఒకటి కొత్తగా ఆవిష్కృతం అవుతూనే ఉంటుంది. తాజాగా శాస్త్రవేత్తలు రంగులు మార్చే వజ్రాన్ని కనుగొన్నారు. ఈ వజ్రం.. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఒక రంగులో, ఆ తరువాత మరో రంగులోకి ఆటోమాటిక్‌గా మారుతోంది. అది చూసి శాస్త్రవేత్తలు సైతం షాక్ అయ్యారు. ఈ వజ్రానికి భారీ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా, ఈ వజ్రాన్ని కాలిఫోర్నియాలోని కార్ల్స్ బాడ్‌లో గల జియోలాజికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అమెరికా(GIA) కు చెందిన సైంటిస్ట్ స్టెఫానీ పెరౌడ్స్ కనుగొన్నారు. ఈ వజ్రాన్ని శాస్త్రీయంగా ‘క్రయోజెనిక్ డైమండ్స్’ అని పిలుస్తారట. వాస్తవానికి ఇలాంటి వజ్రాలు గతంలోనే లభ్యమయ్యాయి. అయితే, ఆ వజ్రాలు చల్లని వాతావరణంలో ఉంచితే బూడిదరంగులోకి మారుతాయి. కానీ, తాజాలా దొరికిన డైమండ్.. బూడిద రంగుతో పాటు, పసుపు రంగులోకి కూడా మారుతోంది. అందుకే ఈ వజ్రాలను ఊసరవెల్లి వజ్రాలు అని పిలుస్తున్నారు సైంటిస్టులు.

వాస్తవానికి స్టెఫానీ పెర్సౌడ్.. కస్టమర్ల కోసం వజ్రాలను గ్రేడింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో.. మూడో రకం రంగు మార్చే వజ్రాన్ని గమనించారు. ఇది చాలా అరుదైన వజ్రంగా పేర్కొంటున్నారు. దీని అధికారిక ధర ఇంకా నిర్ణయించలేదు కానీ, చాలా ఖరీదు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంకా ఈ వజ్రం ప్రత్యేకత ఏంటంటే.. అది చేతుల్లో పెట్టుకున్నప్పుడు రంగు మారదు, ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత ఉన్నా కూడా రంగు మారదు.

మొదటిసారిగా 1866 లో..
రంగులు మార్చే వజ్రాన్ని మొదటిసారిగా 1866 లో పర్షియన్ వజ్రాల వ్యాపారి జార్జెస్ హాల్ఫెన్ కనుగొన్నారు. కానీ, 1943 వరకు ఆభరణాల వ్యాపారంలో రంగు మారే వజ్రాలు పెద్దగా గుర్తించబడలేదు. ఇదిలాఉంటే.. వజ్రాలు రంగు ఎందుకు మారతాయనేది ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలింది. కానీ, కొన్ని వజ్రాలు 200 °C కు వేడి చేసినప్పుడు లేదా 24 గంటలు చీకటిలో ఉంచినప్పుడు వాటి రంగును మార్చుకుంటున్నట్లు సైంటిస్టులు గ్రహిచారు.

కొత్త వజ్రం చాలా విలువైనది..
తాజాగా కనిపెట్టిన వజ్రం చాలా అరుదైనదని జీఐఏ అధికారులు చెబుతున్నారు. ‘‘కొత్త వజ్రం అత్యంత విలువైనది. అరుదైన ఈ వజ్రాన్ని కస్టమర్లు తమ సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఫలితంగా భారీగానే ధర పలుకుతుంది.’’ అని జీఐఏ అధికారి పాల్ జాన్సన్ పేర్కొన్నారు. ఈ వజ్రంపై కాంతి పడినా.. వేడిగా ఉన్న వాతావరణంలో ఉంచినా.. శీతల ప్రాంతంలో ఉంచినా రంగు మారడం దీని ప్రత్యేకత.

Also read:

Health Tips: కరోనా ఎఫెక్ట్.. కీలక విషయాలు వెల్లడించిన వైద్యులు.. ప్రతీ రోజూ ఇలా చేస్తే సేఫ్..!

Bigg Boss 5 Telugu: అసలు గేమ్ మొదలు పెట్టిన షణ్ముఖ్.. గట్టిగానే క్లాస్ తీసుకున్న యాంకర్ రవి..

Afghan: భయాందోళన మధ్య కాలక్షేపం.. బోటింగ్ చేస్తూ సేదతీరుతున్న ఆఫ్ఘన్ ప్రజలు.. ఎక్కడంటే..?