Watch Video: వ్యవసాయం చేస్తోన్న విదేశీ కోడలు.. పొలంలో ఉల్లిపాయలు నాటుతూ మురిసిపోతోన్న జర్మనీ మహిళ

|

Nov 10, 2022 | 9:36 AM

సాధారణంగా భారతీయులు విదేశీ అమ్మాయిలను పెళ్లి చేసుకున్న తర్వాత విదేశాల్లో స్థిరపడటం కామన్‌. విదేశీ అమ్మాయిలు తమ భర్తలతో కలిసి ఇక్కడ స్థిరపడడం చాలా అరుదు.  ఇందుకు భిన్నంగా ఓ విదేశీ కోడలు భారతదేశంలో వ్యవసాయం చేస్తోంది.

Watch Video: వ్యవసాయం చేస్తోన్న విదేశీ కోడలు.. పొలంలో ఉల్లిపాయలు నాటుతూ మురిసిపోతోన్న జర్మనీ మహిళ
German Woman
Follow us on

ప్రేమకు హద్దులుండవు అనే మాటను నిరూపిస్తూ ఈ రోజుల్లో చాలామంది విదేశీ అమ్మాయిలు, అబ్బాయిలతో కలిసి జీవితం పంచుకుంటున్నారు. సరిహద్దులు, సముద్రాలు దాటి మరీ మనసిచ్చిన వారిని మనువాడుతున్నారు. సాధారణంగా భారతీయులు విదేశీ అమ్మాయిలను పెళ్లి చేసుకున్న తర్వాత విదేశాల్లో స్థిరపడటం కామన్‌. విదేశీ అమ్మాయిలు తమ భర్తలతో కలిసి ఇక్కడ స్థిరపడడం చాలా అరుదు.  ఇందుకు భిన్నంగా ఓ విదేశీ కోడలు భారతదేశంలో వ్యవసాయం చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక్కడ విశేషమేమిటంటే.. ఈ విదేశీ కోడలు హిందీలో కూడా సులభంగా మాట్లాడుతోంది. వైరలవుతోన్న ఈ వీడియోలో అచ్చం ఇండియన్‌ స్టైల్‌లో దుస్తులు ధరించి కనిపించిన మహిళ నవ్వుతూ పొలంలో ఉల్లిపాయలు నాటడం మనం చూడవచ్చు. కాగా ఆమె పొలంలో పని చేయడం చూసి, ఆమె భర్త వచ్చి ‘నిన్ను ఒక విషయం అడగవచ్చా’ అని అడుగుతాడు, దానికి ‘అవును’ అని హిందీలో ఆన్సర్‌ చెప్పింది. అప్పుడు భర్త ఆమెను ‘ఎక్కడి నుండి వచ్చావు’ అని అడుగుతాడు, దీనికి ‘నేను జర్మనీ నుండి వచ్చాను’ అని చెప్పి పొలంలో ఉల్లిపాయలు నాటడంలో బిజీ అయ్యింది.

అప్పుడు భర్త ‘నువ్వు జర్మనీ నుంచి ఏడు సముద్రాలు దాటి ఇండియాకు వచ్చింది ఉల్లిపాయలు నాటడానికా’ అని వ్యంగ్యగా అడుగుతాడు. దీనికి ఆమె సంతోషంగా ‘అవును’ అని రిప్లై ఇస్తుంది. ఈ సమయంలో, దూరంగా నిలబడి ఉన్న అత్తగారు కూడా చిరునవ్వులు చిందించడం మనం చూడవచ్చు. కాగా వీడియోలో ఉన్న క్యాప్షన్‌ ప్రకారం ఈ జర్మనీ మహిళ గత నెల నుంచి ఇండియాలోనే ఉంది. భర్తతో కలిసి ఓ గ్రామంలో నివాసముంటోంది. ఈ సందర్భంగా ప్రకృతికి, పచ్చదనానికి దగ్గరగా బతుకుతున్నానంటూ హర్షం వ్యక్తం చేసిందీ జర్మనీ కోడలు. నెటిజన్ల మనసులు గెల్చుకుంటోన్న ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నమస్తేజులి అనే IDతో షేర్‌ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 19 మిలియన్లకు పైగా వ్యూస్‌ రావడం విశేషం. అలాగే1.5 మిలియన్లకు పైగా, అంటే 15 లక్షల మందికి పైగా నెటిజన్లు ఈ వీడియోను లైక్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..