AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూల మొక్కల కోసం తవ్వుతుండగా దడదడలాడే శబ్ధాలు.. ఆ మట్టిలో మెరిసిన 600ఏళ్లనాటి అద్భుతం..!

చాలా సందర్భాల్లో పాత ఇండ్లు, పురాతన భవనాలు మరమ్మతులు చేస్తుండగా ఊహించవి దొరుకుతుంటాయి. కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయాల్లో చరిత్రతో ముడిపడి ఉన్న వస్తువులు కూడా బయటపడుతుంటాయి. సరిగ్గా అలాంటి సంఘటనే ఒక దంపతులకు ఎదురైంది. వారు తమ తోటలో కలుపు తీస్తుండగా దడదడలాడే శబ్దం వినిపించింది. కింద ఏదో లోహం ఉందని వారు గ్రహించారు. వెంటనే అక్కడ మట్టిని తొలగిస్తున్నప్పుడు వారికి ఒక మెరిసే వస్తువు కనిపించింది. దానిని దగ్గరగా చూసినప్పుడు వారు ఊహించని నిధి లభించింది.

పూల మొక్కల కోసం తవ్వుతుండగా దడదడలాడే శబ్ధాలు.. ఆ మట్టిలో మెరిసిన 600ఏళ్లనాటి అద్భుతం..!
Hidden Treasure
Jyothi Gadda
|

Updated on: Sep 25, 2025 | 8:08 PM

Share

చాలా సందర్భాల్లో పాత ఇండ్లు, పురాతన భవనాలు మరమ్మతులు చేస్తుండగా ఊహించవి దొరుకుతుంటాయి. కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయాల్లో చరిత్రతో ముడిపడి ఉన్న వస్తువులు కూడా బయటపడుతుంటాయి. సరిగ్గా అలాంటి సంఘటనే ఒక దంపతులకు ఎదురైంది. వారు తమ తోటలో కలుపు తీస్తుండగా దడదడలాడే శబ్దం వినిపించింది. కింద ఏదో లోహం ఉందని వారు గ్రహించారు. వెంటనే అక్కడ మట్టిని తొలగిస్తున్నప్పుడు వారికి ఒక మెరిసే వస్తువు కనిపించింది. దానిని దగ్గరగా చూసినప్పుడు వారు ఊహించని నిధి లభించింది. అదిచూసిన వారు తమ కళ్లను తామే నమ్మలేక ఆశ్చర్యంలో ఉండిపోయారు..

ఇంగ్లాండ్‌లోని హాంప్‌షైర్‌లో ఉంటున్న ఒక జంటకు ఊహించని నిధి దొరికింది. 50 ఏళ్ల వయసున్న ఒక జంట తమ ఇద్దరు పిల్లలతో వారి తోటలో కలుపు తీస్తున్నప్పుడు ఊహించని నిధిని గుర్తించారు. వారు తమ ఇంటి వెనుక పూల మొక్కల కోసం తవ్వుతుండగా లోపల వెరైటీ శబ్ధాలు వినిపించాయి. ఆ శబ్ధాలు వారికి కొత్తగా అనిపించాయి. వెంటనే అక్కడ మట్టిని తొలగించారు. మట్టి ముద్దలో గుండ్రని, డిస్క్ లాంటి ముక్కలు కనిపించాయని ఆ జంట వివరించారు. మట్టిని శుభ్రం చేసిన తర్వాత వారు అందులో వారికి పురాతన బంగారు నాణేలు కనిపించాయి. దాదాపు 600 సంవత్సరాల నాటి ఈ నాణేలు ఇప్పటికీ అద్భుతమైన స్థితిలో ఉన్నాయి. మట్టిలో బయటపడిన ఆ నిధి వాస్తవానికి ట్యూడర్ కాలం నాటి 70 బంగారు నాణేలు. వాటి విలువ £230,000 (సుమారు రూ. 2.3 కోట్లు) ఉంటుందని అంచనా.

చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నాణేలు:

ఇవి కూడా చదవండి

పురాతన నాణేలు 1420ల నాటివని, అంటే కింగ్ హెన్రీ VI పాలన కాలం నాటివని దర్యాప్తులో తేలింది. ఈ నాణేల్లో ఎక్కువ భాగం 1530లు, హెన్రీ VIII పాలన కాలం నాటివిగా గుర్తించారు. ముఖ్యంగా కొన్ని నాణేలపై హెన్రీ VIII భార్యలలో ఇద్దరు – కేథరీన్ ఆఫ్ అరగాన్, జేన్ సేమౌర్ ల పేర్ల మొదటి అక్షరాలు ఉన్నాయి. ఈ నిధి సమీపంలోని క్రైస్ట్‌చర్చ్ ప్రియరీతో ముడిపడి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. కింగ్ హెన్రీ VIII చర్చి, సన్యాసుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించినప్పుడు సంపన్న మతాధికారులు లేదా వ్యాపారులు తమ సంపదను దాచడానికి ఇలా భూమిలో నాణేలను పాతిపెట్టి ఉండవచ్చునని భావించారు.

ఈ జంట 2020లో అధికారులకు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ సమయంలో దీనిని అరుదైన నిధిగా ప్రకటించారు. బ్రిటిష్ మ్యూజియం కూడా దర్యాప్తు చేసింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా ఆ ప్రదేశాన్ని తవ్వి, మరో ఆరు నాణేలను వెలికితీసింది. అయితే, COVID-19 మహమ్మారి కారణంగా ఏ మ్యూజియం కూడా వాటిని కొనుగోలు చేయలేకపోయింది. చివరికి నిధిని ఆ జంటకు తిరిగి ఇచ్చారు. ఈ నిధిని ఇప్పుడు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లోని డేవిడ్ గెస్ట్ న్యూమిస్మాటిక్స్ వేలంలో విక్రయించనున్నట్టుగా తెలిసింది. నాణేలను ఒక్కొక్కటిగా విక్రయిస్తారు. కానీ మొత్తం విలువ దాదాపు 230,000 పౌండ్లుగా అంచనా వేశారు అధికారులు. ఈ వేలం నవంబర్ 5న జరగనుంది. కొనుగోలుదారులలోనే కాకుండా సాధారణ ప్రజలలో కూడా ఈ నిధి పట్ల ఆసక్తి ఉందని వేలం నిర్వాహకుడు డేవిడ్ గెస్ట్ వెల్లడించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు