Viral: పక్కింట్లోని మొక్కల నుంచి ఘాటైన వాసన.. అనుమానమొచ్చి ఆరా తీయగా

|

Dec 08, 2024 | 11:34 AM

ఓ ఇంటిలో నుంచి ఘాటైన వాసన ఒక్కసారిగా గుప్పుమంది. చుట్టుప్రక్కల వారు ఏంటని ఆరా తీయగా.. దెబ్బకు బిత్తరపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంతకీ ఆ వివరాలు ఇలా..

Viral: పక్కింట్లోని మొక్కల నుంచి ఘాటైన వాసన.. అనుమానమొచ్చి ఆరా తీయగా
Trending
Follow us on

ఎన్ని కొత్త చట్టాలు అమలులోకి వస్తున్నా.. గంజాయి, మత్తు పదార్ధాల అక్రమ రవాణాకు మాత్రం అడ్డుకట్ట పడట్లేదు. పోలీసులు కళ్లుగప్పి.. ఈ గబ్బును విచ్చలవిడిగా స్మగ్లింగ్, అమ్మకాలు చేస్తున్నారు కేటుగాళ్లు. తెలుగు రాష్ట్రాల్లో అయితే.. రోజూ పదుల సంఖ్యలో ఈ గంజాయి, డ్రగ్స్‌కి సంబంధించి అక్రమ రవాణా కేసులు నమోదవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ తరహ ఘటన ఒకటి తమిళనాడులోని తొలంపలయం గ్రామంలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో గంజాయి సాగు సాగిస్తున్నాడు. చుట్టుప్రక్కల వారికి ఘాటైన వాసన గుప్పుమనడంతో పోలీసులకు సమాచారం అందించారు.

ఇది చదవండి: పుష్ప 2 మూవీలో ఈ హీరోయిన్ ఎవరో తెల్సా.. బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

ఇక రంగంలోకి దిగిన కోయంబత్తూరు రూరల్ పోలీసులు స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో సుమారు 3 కిలోల బరువున్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్ 7న, శనివారం పక్కా సమాచారంతో ఆకస్మిక తనిఖీలు చేయగా.. ఈ గబ్బు గుట్టు రట్టయింది. గంజాయి మొక్కలను సాగు చేస్తున్న 45 ఏళ్ల గణేశన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కారమడై పోలీసులు గణేశన్‌ను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో ఏంటని చూడగా

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..