Viral Video: ‘దొంగా.. దొరికిపొయ్యావ్’.. అతడి రియాక్షన్ చూస్తే నవ్వులే నవ్వులు

|

Nov 15, 2021 | 11:09 AM

దొంగలకు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోంది. గతంలోలా వారు చోరీలకు పాల్పడేందుకు వీలు చిక్కడం లేదు. పోలీసులు ఎక్కడిక్కడ బెండు తీస్తున్నారు.

Viral Video: దొంగా.. దొరికిపొయ్యావ్.. అతడి రియాక్షన్ చూస్తే నవ్వులే నవ్వులు
Funny Theft
Follow us on

దొంగలకు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోంది. గతంలోలా వారు చోరీలకు పాల్పడేందుకు వీలు చిక్కడం లేదు. పోలీసులు ఎక్కడిక్కడ బెండు తీస్తున్నారు. టెక్నాలజీ సాయంతో ఈజీగా పట్టేస్తున్నారు. వీటికి తోడు థర్డ్ ఐ(సీసీ కెమెరాలు) వారికి ప్రాణ సంకంటంగా మారిపోయింది.  చిన్న తప్పులు చేసినవారు కూడా ఈజీగా దొరికిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి  దొంగతనం చేసి.. సీసీ కెమెరాలు కనిపింగానే..  ఫన్నీగా  డ్యాన్స్ చేశాడు. ఇంటర్నెట్‌లో రోజూ విభిన్న రకాలైన వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. అందులో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. ఈ వీడియో కూడా అలాంటిదే. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఓ వ్యక్తి షాపింగ్ మార్ట్‌లోకి  ప్రవేశించాడు. ఆ తర్వాత సైలెంట్‌గా వచ్చి అక్కడే ఉన్న ప్యాకెట్‌ను తన టీ షర్ట్‌లో దాచుకున్నాడు. అయితే ఆ తర్వాత అతడి కళ్లు ఎదురుగా అమర్చిన సీసీటీవీపై పడ్డాయి. కెమెరా చూడగానే ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. తర్వాత కొంత సేపు అక్కడే నిల్చున్నాడు. అనంతరం, అకస్మాత్తుగా డ్యాన్స్ చేస్తూ, దొంగిలించిన ప్యాకెట్‌ను తిరిగి అదే ప్లేసులో పెట్టాడు.

ఈ వీడియో నెటిజన్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అతడు ఎందుకు డ్యాన్స్ చేశాడో ఎవరికీ అర్థం కావట్లేదు. ఈ 16 సెకన్ల వీడియో టైరీస్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో షేర్ చేయబడింది. ఒక రోజు క్రితం షేర్ చేసిన ఈ వీడియోను 6 లక్షల 58 వేల మందికి పైగా వీక్షించారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అదే సమయంలో, యూజర్స్ ఈ వీడియోపై తమదైన స్టైల్లో కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Andhra Pradesh: రాములోరి కంట నీరు.. ముప్పు తప్పదంటున్న భక్తులు

Tollywood Heroine: ఈ నటి ఎవరో గుర్తుపట్టారా ? అప్పట్లో తెలుగునాట సెన్సేషన్..