Viral Video: వామ్మో! ఇలా ఉన్నారేంటయ్యా.. బస్సులో సీట్ కోసం విన్యాసాలు.. చూస్తే కళ్లు చెదిరే..

ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు బస్సు ఎక్కే దగ్గర నుంచి సీటు దొరికి కూర్చునే వరకూ ఓ మినీ యుద్ధం చేయాల్సి ఉంటుంది. పల్లెటూరు..

Viral Video: వామ్మో! ఇలా ఉన్నారేంటయ్యా.. బస్సులో సీట్ కోసం విన్యాసాలు.. చూస్తే కళ్లు చెదిరే..
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 08, 2022 | 8:03 PM

ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు బస్సు ఎక్కే దగ్గర నుంచి సీటు దొరికి కూర్చునే వరకూ ఓ మినీ యుద్ధం చేయాల్సి ఉంటుంది. పల్లెటూరు నుంచి పట్టణం వరకు చాలామంది ప్రజలు ఇలాంటి యుద్ధం చేస్తుంటారు. బస్టాండ్‌లోని ప్లాట్‌ఫార్మ్‌పైకి బస్సు రాకముందే.. అల్లంత దూరం నుంచి ఆ బస్సు వెంట పరిగెత్తుతూ.. కిటికీలో నుంచి కర్చీఫూలు, లేదా మన బ్యాగులు వేస్తూ సీటును ఆపుకుంటూ ఉంటారు జనాలు. ఒకవేళ బస్టాండ్‌లోకి వచ్చినా.. సీటు దొరకదేమోననే అనుమానంతో కొంతమంది కిటీకీలలో నుంచి తమ లగేజీని విసిరేసి.. పక్కవారికి ‘ఈ సీట్ తమదని చెబుతారు’ కాస్త చూడమని కోరుతారు. అయితే ఇక్కడ భార్యాభర్తలు సీట్ కోసం నెక్స్ట్ లెవెల్‌లో విన్యాసం చేశారని చెప్పాలి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ భర్త బస్సులోని చివరి సీటులో ఎక్కుతాడు. ఆ తర్వాత భార్య తనకిచ్చిన సామాన్లను అందులో ఉంచుతాడు. ఇక భర్త కిటికీలో నుంచి వచ్చేయమనడంతో ముందుగా ఆ మహిళ చెప్పులను అతడికి ఇస్తుంది. ఆ తర్వాత భర్త చెయ్యి అందివ్వడంతో.. అతడి సహాయంతో లోపలికి వెళ్లిపోతుంది. వీరి విన్యాసం చూసిన ఇతరులు షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, ఈ వీడియోను ‘memecentral.teb’ అనే ఇన్‌స్టా ఖాతా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. దీనిని చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. కొంతమంది అలా చేయడం చాలా ప్రమాదం అని కామెంట్ చేయగా.. మరికొందరు జూగాడ్ ఉంటే.. ఏదైనా సాధ్యమవుతుందని కామెంట్ చేశారు.

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!