కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి ఎన్నో రకాల వైవిధ్యాలకు గురై ప్రస్తుత రూపానికి వచ్చిందని మనం చిన్నప్పుడే చదువుకున్నాం. ఈ సృష్టిలో ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. కంటికి కనిపించని సూక్ష్మజీవుల నుంచి భూమిపై ఉండే అత్యంత పెద్దవైన ఏనుగుల వరకు ఎన్నో రకాల జీవులు మనుగడ సాగిస్తున్నాయి. ఎప్పటినుంచో జరుగుతోన్న ఈ మార్పు నేటికీ కొనసాగుతూనే ఉంది. అంతే కాకుండా ఆహారపు అలవాట్లు, జీవన శైలి రకరకాలుగా మారిపోతున్నాయి. ఆదిమానవులు అడవులలో నివాసముండే కాలం నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే స్థాయి వరకు చేరుకున్నారు. వేల మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి నుంచి ఎన్నో రకాల జంతుజాతులు అంతరించిపోయాయి. ఈ క్రమంలో మిలియన్ల సంవత్సరాల నాటి ఒక జీవి మరోసారి భూమిపై కనిపించింది. ఇది ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. నిజమని నమ్మక తప్పదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో లక్షల ఏళ్ల నాటి ఓ జీవి కనిపించింది. 80 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ జీవి నడయాడినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. దీనిని ‘ది ఫ్రిల్డ్ షార్క్’ అని కూడా పిలుస్తారు. ఈ భయంకరమైన సొరచేప జపాన్‌లోని అవాషిమా ద్వీపంలో కనిపించింది.
Prehistoric 80 million year old shark also known as ”the frilled shark” discovered in Awashima, Japan. ?? pic.twitter.com/SdDdlbalQD
ఇవి కూడా చదవండి— H0W_THlNGS_W0RK (@wowinteresting8) August 10, 2022
ఈ సొరచేప నోటిలో 300 దంతాలు ఉండగా.. నీటిలో ఈదుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వింత షార్క్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 23 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 3.9 మిలియన్లు వ్యూస్ వచ్చాయి. 78 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..