తొలిసారి ఓనమ్ సాధ్య విందు రుచి చూసిన ఫ్రెంచ్ మహిళ..ఏం చెప్పిందంటే..
ఓనమ్ అనేది దక్షిణాది రాష్ట్రమైన కేరళలో ఆనందం, భక్తితో జరుపుకునే సాంప్రదాయ భారతీయ పండుగ. ఢిల్లీలో జరిగిన సాంప్రదాయ ఓనం సాధ్యకు తొలిసారి హాజరైన ఓ ఫ్రెంచ్ మహిళ తన అనుభవాన్ని నెటిజన్లతో పంచున్నారు. ఆ మహిళ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ ట్వీట్ కు చాలా మంది భారతీయుల నుండి స్పందనలు వచ్చాయి. 79,500 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. దాంతో పాటు

ఓనమ్ అనేది దక్షిణాది రాష్ట్రమైన కేరళలో ఆనందం, భక్తితో జరుపుకునే సాంప్రదాయ భారతీయ పండుగ. ఈ పండుగ ప్రధాన అంశంగా అరటి ఆకుపై వడ్డించే గొప్ప శాఖాహార విందు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు మతాలకు అతీతంగా జరుపుకునే పండగ ఓనమ్. ఇందులో క్రిస్పీ అరటిపండు చిప్స్, టాంజీ ఇంజి పులి నుండి కొబ్బరితో కూడిన అవియల్, మంచి సువాసనతో కూడిన సాంబార్, మెత్తటి మట్ట బియ్యం, క్రీమీ పాయసం వరకు దాదాపు 26 వంటకాలు ఉంటాయి. ఇప్పుడు, ఒక ఫ్రెంచ్ మహిళ దేశ రాజధాని న్యూఢిల్లీలో భారతీయ వంటకాలను ఆస్వాదిస్తూ పండుగను జరుపుకున్న విధానం, తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వైరల్ వీడియో ప్రకారం..దాదాపు రెండు సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చిన జూలియా చైగ్నో తొలిసారి కేరళ విందు ఓనమ్ సాధ్యకు హాజరైంది. చాలా కొత్తగా, విభిన్న రుచులతో ఇది అద్భుతంగా ఉందని చెప్పింది.. విభిన్న రుచులతో అద్భుతమైన భోజనాన్ని ఆస్వాదిస్తున్న ఫోటోలను ఇంటర్‌నెట్‌లో షేర్ చేసింది. ఇందుకు క్యాప్షన్గా తాను “నా జీవితంలో 20 సంవత్సరాలు భారతీయ ఆహారం లేకుండా నేను ఎలా జీవించానో నాకు తెలియదు!” అని Ms చైగ్నో X (గతంలో ట్విట్టర్) లో రాశారు. ఈపోస్ట్ కు 79,500 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.
I don’t know how I survived 20 years of my life without Indian food!
Today I went for Onam Sadhya for the first time. It was incredible with so many new different flavours. I ate way too much but no regrets life is good.
Now I can take a nap. pic.twitter.com/TRL7D77ZnF
— Julia Chaigneau (@juliachaigneau) September 5, 2025
ఈరోజు తాను మొదటిసారి ఓనమ్ సాధ్యకు వెళ్ళానని చెప్పింది.. చాలా కొత్త విభిన్న రుచులతో ఈ విందు అద్భుతంగా ఉందని చెప్పింది. అంతేకాదు.. తాను చాలా ఎక్కువగా తిన్నానని, చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఇప్పుడు కాసేపు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అంటూ రాసింది.
సోషల్ మీడియాలో ఈ పోస్ట్ ఎక్కువ మంది ప్రజల ఆదరణ పొందడంతో నెట్టింట వేగంగా వైరల్‌గా మారింది. దీనిపై చాలా మంది స్పందించారు. చైగ్నోకు భారతీయ సంస్కృతిపై ఉన్న ఇష్టాన్ని ప్రజలు అభినందించారు. ఆమెపై పోస్ట్‌పై ప్రజలు ప్రశంసలు కురిపించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




