కాలేజీలోనే పొట్టుపొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. పండగ చేసుకుంటున్న అబ్బాయిలు.. షాకింగ్ వీడియో

చిన్న చిన్న కారణాలకే చాలామంది ఘర్షణలకు దిగుతున్నారు. ముఖ్యంగా యువత కూడా ఇదే దారిలో పయనిస్తోంది. ఇలాంటి ఘటనలు తరచుగా సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంటాయి.

కాలేజీలోనే పొట్టుపొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. పండగ చేసుకుంటున్న అబ్బాయిలు.. షాకింగ్ వీడియో
College Girls Fight

Updated on: Nov 19, 2022 | 9:37 AM

Girls Street Fight Video: చిన్న చిన్న కారణాలకే చాలామంది ఘర్షణలకు దిగుతున్నారు. ముఖ్యంగా యువత కూడా ఇదే దారిలో పయనిస్తోంది. ఇలాంటి ఘటనలు తరచుగా సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంటాయి. ముఖ్యంగా కాలేజీ యువతులు, అమ్మాయిలు కొట్లాడుకునే వీడియోలు ఇంతకుముందు కూడా తెగ వైరల్ అయ్యాయి. కొన్నిసార్లు బాయ్‌ఫ్రెండ్‌ కోసం.. మరికొన్ని సార్లు ఏదో ఒక విషయంపై అమ్మాయిలు వీధిలో కొట్లాటకు దిగిన సందర్భాలున్నాయి. జుట్లు పట్టుకొని మరీ కొట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. తాజాగా, అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో హల్ చల్ చేస్తోంది.

నాసిక్‌లోని ఓ ప్రసిద్ధ కాలేజీలో అమ్మాయిల కొట్లాటకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. నాసిక్‌లోని గంగాపూర్ రోడ్ ప్రాంతంలో ఉన్న ఓ కళాశాలలో అమ్మాయిల మధ్య ఈ ఘర్షణ జరిగినట్లు పేర్కొంటున్నారు. గొడవలో మధ్యలో వెళ్లిన యువతి ఆగ్రహంతో ఊగిపోవడం వీడియోలో కనిపిస్తోంది. కాగా వీడియోలో కనిపిస్తున్న గొడవపడుతున్న ఇద్దరు ఒకరిపై ఒకరు చేయిజేసుకోవడంతోపాటు.. జుట్టు పట్టుకొని లాగుతూ కనిపించారు. కళాశాల సమయంలో ఈ ఘర్షణ జరగడంతో.. విద్యార్థులు ఈ యువతుల గొడవను చూస్తూ వీడియోలు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

క్యాంటీన్‌‌కు వచ్చిన యువతులు వాగ్వాదానికి దిగినట్లు పేర్కొంటున్నారు. ఈ ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఇదిలాఉంటే.. ఈ ఘర్షణను విద్యార్థులు చూస్తూ.. వీడియోలు రికార్డు చేసుకున్నారు. ఎవరూ కూడా వారిని ఆపేందుకు ప్రయత్నించలేదు. ఈ గొడవకు సంబంధించిన వీడియోపై పలువురు పలు రకాలుగా కామెంట్లు చేసుకుంటున్నారు.

వీడియో చూడండి..

అయితే, ఏదో లవ్ విషయంలోనే వారి మధ్య గొడవ జరిగి ఉంటుందని నెటిజన్లు ఫన్నీగా ట్విట్ చేస్తున్నారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి