జాలర్ల వలలో భారీ చేప.. బరువు ఎంతో తెలిస్తే షాకే !!

జాలర్ల వలలో భారీ చేప.. బరువు ఎంతో తెలిస్తే షాకే !!

Phani CH

|

Updated on: Nov 19, 2022 | 9:34 AM

సముద్రాలు ఎన్నోరకాల వింత జీవులకు నిలయాలు. జాలర్లు వేటకు వెళ్లినప్పుడు ఒక్కోసారి అరుదైన జీవులు వారి వలలో చిక్కుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒడిశాలోని బాలాసోర్‌ తీరంలో చోటు చేసుకుంది.

సముద్రాలు ఎన్నోరకాల వింత జీవులకు నిలయాలు. జాలర్లు వేటకు వెళ్లినప్పుడు ఒక్కోసారి అరుదైన జీవులు వారి వలలో చిక్కుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒడిశాలోని బాలాసోర్‌ తీరంలో చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లిన అక్కడి జాలర్లకు ఓ భారీ చేప చిక్కింది. ఆ చేప అత్యంత అరుదైన చేప. మాంసాహార జీవ జాతికి చెందిన ఈ భారీ చేపలు అత్యంత అరుదుగా కనిపిస్తుంటాయి. దీన్ని మార్లిన్‌ ఫిష్‌ అని, మార్లిన్‌ AKA అని, సెయిల్‌ మార్లిన్ అని పిలుస్తారు. ఇంతకూ తాజాగా చిక్కిన ఈ చేప బరువు ఎంతో తెలుసా..? ఒకటి కాదు, పది కాదు, 100 కాదు, ఏకంగా 550 కిలోలు. ఈ అరుదైన చేపను మత్స్యకారులు లక్ష రూపాయలకు విక్రయించారు. ఈ చేపలో ఒత్తిడిని నియంత్రించే ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయని, అందుకే దీన్ని ఒత్తిడి నివారణ మందుల తయారీకి వినియోగిస్తారని అసిస్టెంట్ ఫిషరీస్‌ ఆఫీసర్‌ పార్థసారధి స్వెయిన్‌ తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోనే ఎక్కువ మంది సబ్‌స్క్రైబ‌ర్స్ ఉన్న యూట్యూబ‌ర్‌

‘నాన్నా.. ప్రాణం పోయినా తప్పు చేయను, వాళ్లను వదలొద్దు’

గుడ్ న్యూస్.. ట్రైన్‌లో ఇక నుంచి మీరు కోరుకున్న ఫుడ్.. ఆ అవకాశం ఎవరికంటే ??

ఈ వ్యక్తి ముక్కు ప్రపంచంలోనే అత్యంత పొడవు.. మ్యూజియంలో అతని..

ఏడేళ్లుగా ప్రేమించి, పెళ్లాడి మొదటి రాత్రే విడాకులు అడిగిన భర్త !!

 

Published on: Nov 19, 2022 09:34 AM