ప్రపంచంలోనే ఎక్కువ మంది సబ్‌స్క్రైబ‌ర్స్ ఉన్న యూట్యూబ‌ర్‌

ఇటీవల కాలంలో సామాజిక మాద్యమాల వినియోగం భారీగా పెరిగింది. అందులోనూ యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త కొత్త కంటెంట్‌తో చాలా మంది యూట్యూబ్ ద్వారా స్టార్స్ కూడా అవుతున్నారు.

ప్రపంచంలోనే ఎక్కువ మంది సబ్‌స్క్రైబ‌ర్స్ ఉన్న యూట్యూబ‌ర్‌

|

Updated on: Nov 19, 2022 | 9:32 AM

ఇటీవల కాలంలో సామాజిక మాద్యమాల వినియోగం భారీగా పెరిగింది. అందులోనూ యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త కొత్త కంటెంట్‌తో చాలా మంది యూట్యూబ్ ద్వారా స్టార్స్ కూడా అవుతున్నారు. ఆదాయ మార్గంగా కూడా చాలా మంది దీనిని ఎంచుకుంటున్నారు. సరైన కంటెంట్‌తో ప్రజలను ఆకట్టుకుంటున్న కొందరు యూబ్యూబర్లు మాత్రం తెగ పాపులర్ అవుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే ఎక్కువ మంది సబ్‌స్క్రైబ‌ర్స్ ఉన్న యూట్యూబ‌ర్‌గా నిలిచాడు అమెరికాకు చెందిన జిమ్మీ డొనాల్డ్స్. అయితే జిమ్మీ డొనాల్డ్స్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు.. కాని మిస్టర్ బీట్స్ అంటే మాత్రం చాలా మందికి గుర్తొస్తాడు ఈ యూట్యూబర్. మిస్టర్ బీట్స్‌గా పాపులర్ అయిన జిమ్మీ డొనాల్డ్ ప్రస్తుతం దాదాపు 112 మిలియ‌న్ స‌బ్‌స్క్రైబ‌ర్స్ అంటే 11 కోట్లకు పైగా సబ్‌స్క్రిప్షన్‌ కలిగి ఉన్నాడు. గ‌త కొన్నాళ్లుగా యూట్యూబ్‌లో రారాజుగా వెలుగొందుతున్న స్వీడ‌న్‌కి చెందిన చెందిన ఫెలిక్స్ అర్వింద్ ఉల్ఫ్ జెల్‌బ‌ర్గ్‌ని మిస్టర్ బీట్స్ వెన‌క్కి నెట్టాడు. ప్యూ డై పైగా పేరుగాంచిన ఫెలిక్స్‌కు యూట్యూబ్‌లో 111.8 మిలియ‌న్ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్స్ ఉన్నారు. బీస్ట్‌ యూట్యూబ్ ఛానెల్‌ని స‌బ్‌స్క్రైబ్ చేసుకున్న వాళ్ల సంఖ్య ఈమ‌ధ్యే 111.9 మిలియ‌న్లకు చేరింది. ఈ ఏడాది జూలైలో వంద మిలియ‌న్ల స‌బ్‌స్క్రైబ‌ర్స్‌ని సాధించిన రెండో యూట్యూబ‌ర్‌గా జిమ్మీ గుర్తింపు సాధించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘నాన్నా.. ప్రాణం పోయినా తప్పు చేయను, వాళ్లను వదలొద్దు’

గుడ్ న్యూస్.. ట్రైన్‌లో ఇక నుంచి మీరు కోరుకున్న ఫుడ్.. ఆ అవకాశం ఎవరికంటే ??

ఈ వ్యక్తి ముక్కు ప్రపంచంలోనే అత్యంత పొడవు.. మ్యూజియంలో అతని..

ఏడేళ్లుగా ప్రేమించి, పెళ్లాడి మొదటి రాత్రే విడాకులు అడిగిన భర్త !!

కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను వదిలించుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

 

 

Follow us
Latest Articles