కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను వదిలించుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను వదిలించుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

Phani CH

|

Updated on: Nov 19, 2022 | 9:21 AM

ఐపీఎల్‌ మినీ వేలానికి ముందు.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. గతేడాది స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ను వదులుకున్న ఫ్రాంచైజీ..

ఐపీఎల్‌ మినీ వేలానికి ముందు.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. గతేడాది స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ను వదులుకున్న ఫ్రాంచైజీ.. తాజాగా కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను జట్టు నుంచి రిలీజ్‌ చేసింది. విలియమ్సన్‌తో పాటు విండీస్‌ విధ్వంసక ఆటగాడు నికోలస్‌ పూరన్‌ను కూడా వేలానికి వదిలేసింది. మరి మినీ వేలంలో వీరిని తిరిగి దక్కించుకుంటుందా లేక.. జట్టును కొత్తగా ఎంపిక చేసుకుంటుందా చూడాలి. ప్రస్తుతం మొత్తం పది జట్లలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వద్దే అత్యధిక మొత్తం 42 కోట్లు 25 లక్షల మేర అందుబాటులో ఉంది. గత సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్‌ అగర్వాల్‌ను ఆ జట్టు రిలీజ్‌ చేయడంతో ప్రస్తుతం పంజాబ్‌ వద్ద 32 కోట్ల 25 లక్షల నగదు ఉంది. అయితే ఈ వేలానికి ముందు అన్నీ జట్లకు అదనంగా మరో ఐదేసి కోట్లు కేటాయించనున్నారు. డిసెంబర్ 23న కొచ్చి వేదికగా ఐపీఎల్ మినీ వేలం జరుగనుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అరే !! ఇంత రాక్షసత్వమా.. కుక్కకు ఉరి వేసి చంపిన దుండగులు !!

మిత్రుడి పెళ్లికి హాజరైన అమెరికా ఫ్రెండ్స్‌.. వాళ్ల వేషధారణ చూసి.. !!

Viral: మహిళ కడుపులో 4 అడుగుల పాము !! డాక్టర్లు షాక్‌ !!

తెలుగు సినిమాలపై కోలీవుడ్ వార్.. విజయ్‌ కారణంగానే ఈ పరిస్థితి

Mahesh Babu: తండ్రి పోయిన బాధలోనూ.. చిన్నారికి ప్రాణం పోశాడు..

Published on: Nov 19, 2022 09:21 AM