Viral Video: పిచ్చి పీక్ స్టేజ్‌లో.. స్కూటర్ పై ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్న యువకులు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఎన్ని చెప్పినా ఎన్ని సంఘటనలు చూసినా నేటి యువత ఆలోచనల్లో మార్పు రావడం లేదని పిస్తుంది తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే.. కొంత మంది యువకులు స్కూటర్లపై ప్రమాదకరమైన విన్యాసాలు చేయడమే కాదు రోడ్డుపై వెళ్లే ఇతర పాదచారులకు కూడా ప్రమాదం కలిగిస్తున్నారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వైరల్ వీడియో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌కు చెందినదని చెబుతున్నారు.

Viral Video: పిచ్చి పీక్ స్టేజ్‌లో.. స్కూటర్ పై ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్న యువకులు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Dangerous Scooty Stunt Video
Image Credit source: X/@Ilyas_SK_31

Updated on: Sep 30, 2025 | 2:20 PM

సోషల్ మీడియాలో ఒక వీడియో ప్రత్యక్షం అయింది. ఇది ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇందులో కొంతమంది యువకులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఈ వీడియోలో నలుగురు కాదు ఐదుగురు యువకులు స్కూటర్పై ఉన్నట్లు.. చూపిస్తుంది. అంతేకాదు నలుగురు యువకులు కలిపి ఐదవ యువకుడిని భుజాలపై మోసుకెళ్తున్న తీరు చూసి షాక్ కలిగిస్తుంది. అంతేకాదు ఈ వీడియోలో ఉన్న యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ వైరల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ కుర్రాళ్ళు ప్రమాదకరమైన విన్యాసాలు చేయడమే కాకాదు.. రోడ్డుమీద వెళ్తున్న ఇతర ప్రయాణీకులకు కూడా ప్రమాదం కలిగిస్తున్నారు. నివేదికల ప్రకారం ఈ వీడియో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ కి చెందినది అని తెలుస్తోంది. 18 సెకన్ల నిడివి గల ఈ వీడియో క్లిప్‌లో నలుగురు అబ్బాయిలు ఒకే స్కూటర్‌పై కూర్చుని.. ఐదవ యువకుడిని తమ భుజాలపై పడుకొబెట్టుకుని ఉన్నట్లు చూపిస్తుంది. ఈ యువకుల్లో ఎవరూ హెల్మెట్ ధరించలేదని వీడియోలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

వీడియో రికార్డ్ చేసిన వ్యక్తి మీ యాక్షన్‌ ‘చాలా బాగుంది.. నంబర్ వన్’ అని కామెంట్ చేసినప్పుడు.. మొదట అందరు అబ్బాయిలు భయంతో తమ ముఖాలను దాచుకోవడానికి ప్రయత్నించారు. అయితే తమ ప్రశంసించారు అని అర్ధం చేసుకున్న తర్వాత ఆ యువకులు వెనక్కి తిరిగి ‘ధన్యవాదాలు బ్రదర్’ అని చెప్పి వెళ్ళిపోయారు.

@Ilyas_SK_31 అనే ట్విట్టర్ హ్యాండిల్లో ఇలియాస్ అనే యూజర్ ఈ వీడియోను షేర్ చేసి, “ఈ ప్రమాదకరమైన ప్రవర్తన ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది” అని రాశారు. ఆ యూజర్ ఛత్తీస్‌గఢ్, బీజాపూర్ పోలీసులను ట్యాగ్ చేసి.. వెంటనే దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ వీడియో చూసిన ఒక వ్యక్తి.. “మొదట్లో మృతదేహాన్ని మోసుకెళ్తున్నట్లు అనిపించిందని కామెంట్ చేశారు. మరొకరు “ఇప్పుడు వాళ్ళు రీల్ చేయడానికి పట్టాలపైకి వెళ్తున్నారని.. మరొకరు “ఇలాంటి వికృత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఛత్తీస్‌గఢ్ పోలీసుల నుంచి ఈ విషయంపై ఇంకా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అయితే వీడియో కామెంట్ విభాగంలో ప్రజలు నిరంతరం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

వీడియోను ఇక్కడ చూడండి

 

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..