Viral Video: టాయిలెట్‌ కెళ్లిన స్టూడెంట్.. ఒక్కసారిగా దూసుకొచ్చిన అనుకోని అతిధి.. దెబ్బకు ఫ్యూజులౌట్!

|

Jul 15, 2022 | 1:06 PM

వాష్‌రూంకు ఎందుకు వెళ్తాం.. ఏంటీ సిల్లీ క్వశ్చన్‌ అంటారా.. ఆగండాగండి ఇక్కడే ఉంది అసలు కిటుకు. వాష్‌రూంకు మనం రిలాక్స్‌ కావడానికో...

Viral Video: టాయిలెట్‌ కెళ్లిన స్టూడెంట్.. ఒక్కసారిగా దూసుకొచ్చిన అనుకోని అతిధి.. దెబ్బకు ఫ్యూజులౌట్!
Udumu
Follow us on

వాష్‌రూంకు ఎందుకు వెళ్తాం.. ఏంటీ సిల్లీ క్వశ్చన్‌ అంటారా.. ఆగండాగండి ఇక్కడే ఉంది అసలు కిటుకు. వాష్‌రూంకు మనం రిలాక్స్‌ కావడానికో.. లేదంటో ఇతరత్రా పనులను పూర్తి చేసుకునేందుకే కదా వెళ్తాం.. కానీ అక్కడ ఊహించనివి ఎదురైతే. షాక్‌కు గురయ్యే సిచ్యువేషన్‌ కలిగితే.. ఎలా అంటారా.. చూడండి.

బాత్‌రూంకని బయలుదేరిన ఓ విద్యార్ధికి.. వింత అనుభవం ఎదురైంది. వాష్‌రూంకు వెళ్లిన ఓ స్టూడెంట్‌‌.. టాయిలెట్ బేసిన్ నుంచి వింత శబ్దాలు రావడాన్ని గమనించింది. భయపడుతూనే ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్లింది. ఏంటా అని చూసేసరికి దెబ్బకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. అక్కడ ఓ ఇగువాన ఉండటం చూసింది. దెబ్బకు దడుసుకుని బయటికి పరుగులు తీసింది.

ఇలా వన్‌, టూకు పోయే ప్లేసుల్లో కూడా ఇలాంటి విష జంతువులు వస్తుండడం వణికించేలా చేస్తోంది. తమ ఆవాసాలను వీడి జనావాసాల్లోకి వస్తున్న జంతువులు.. ఇలా మనుషులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి కొన్నిచోట్ల. మన దగ్గర ఎలుగుబంట్లు, ఏనుగుల హవా ఉంటే.. కొన్ని దేశాల్లో ఇలా చీతాలు, లిజార్డ్‌లు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం…