AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: గంగమ్మకు మొక్కి వల వేసిన జాలరి.. తీరా చిక్కినవి చూసి ఆశ్చర్యం…

కేరళలో గత ఆదివారం రోజున ఎప్పటిలాగే చేపల వేటకు వెళ్లిన జాలరి వింత అనుభవం ఎదరైంది. అళికోడ్ సమీపంలోని పుతియా కడపపురం నివాసి అయిన రస్సల్ తన చేపల వేట యాత్రలో అసాధారణమైన ఆవిష్కరణ చేశాడు. ఆ డీటేల్స్ కథనం లోపల తెలుసుకుందాం ...

Viral: గంగమ్మకు మొక్కి వల వేసిన జాలరి.. తీరా చిక్కినవి చూసి ఆశ్చర్యం...
Fisherman (Representative image )
Ram Naramaneni
|

Updated on: Sep 23, 2025 | 3:36 PM

Share

చేపల కోసం వల వేస్తే.. కొండచిలువలు, మొసళ్లు అందులో చిక్కడం మనం ఇప్పటివరకు చూశాం. కానీ కేరళలో అంతకంటే విచిత్రం జరిగింది. మలప్పురం జిల్లాలో జాలర్లు చేపల కోసం వల వేయగా.. రెండు సర్ప విగ్రహాలు అందులో చిక్కాయి. అవి ఇత్తడితో తయారు చేసినవి. చూస్తుంటే చాలా పురాతనమైనవి అనిపిస్తున్నాయి. సమాచారం అందండంతో అధికారులు వచ్చి.. వాటిని స్వాధీనం చేసుకన్నారు.

అళికోడ్ సమీప ప్రాంతం.. పుతియా కడపపురంకు చెందిన రస్సల్ అనే జాలరి వలలో ఈ విగ్రహాలు చిక్కాయి. వాటిని చూసి ఆశ్చర్యానికి గురైన అతను.. ఒడ్డుకు తీసుకొచ్చి వాటిని శుభ్రం చేశాడు. తూకం వేయగా.. ఒక్కో విగ్రహం బరువు సుమారు 5 కేజీలు ఉంది. ఈ విగ్రహాలు సముద్రంలోకి ఎలా వచ్చాయి. అవి అంత ప్రవాహంలో కూడా పక్కపక్కనే ఎలా ఉన్నాయి..?  వాటిని దొంగిలించారా..? లేదా పురాతనమైనవి అని నిమజ్జనం చేశారా అని విషయాలపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. వాటిని పురావస్తు శాఖకు అప్పగించనున్నారు. ఇత్తడి సర్ప విగ్రహాలను ఇంటి గడపల వద్ద ఉంచుతారు. ఇవి ఉంటే.. చెడు శక్తుల నుంచి రక్షణ ఉంటుందని ప్రజల నమ్మకం.

Serpent Idols

Serpent Idols

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..