బాబోయ్.. ఆ ఇంటి కిచెన్ లోంచి ఎప్పుడూ వినని శబ్ధాలు..! పాములేమో అనుకుని పగులగొట్టి చూడగా..

|

Aug 09, 2024 | 4:20 PM

లోరూఫ్‌లోంచి కనిపించిన దాన్ని చూడగానే రెస్క్యూ టీంతో పాటూ ఆ ఇంట్లోని వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. తర్వాత దాని తోక పట్టుకుని లాగారు. అయితే మొదట ఎంత లాగినా అది గట్టిగా పట్టుకోవడంతో కిందకు రాలేదు. వారు దాన్ని బలవంతంగా బయటకు లాగారు. ఆ జీవి చూసేందుకు సరిగ్గా మొసలి అంతా పెద్దదిగా అచ్చం బల్లిలా కనిపిస్తుంది. చివరకు వారు

బాబోయ్.. ఆ ఇంటి కిచెన్ లోంచి ఎప్పుడూ వినని శబ్ధాలు..! పాములేమో అనుకుని పగులగొట్టి చూడగా..
Monitor Lizard
Follow us on

వర్షాకాలంలో అనేక జీవులు అడవుల నుండి బయటకు వచ్చి, పొడి, వెచ్చని ప్రదేశాలను వెతుక్కుంటూ మానవ నివాసాల్లోకి ప్రవేశిస్తాయి. అందుకే ఈ సీజన్‌లో తరచూ ఇంటి మూలలు, కోళ్లు, పశువుల పాకలో పాములు, ఇతర జంతువులు వంటివి నక్కి ఉండటం చూస్తుంటాం. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎప్పుడో వంటగది పైకప్పులో దూరిన వింత జీవిని చూసిన ఆ ఇంటిళ్లిపాది షాక్‌కు గురయ్యారు.. వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. ఆ తర్వాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇండోనేషియా నుండి వెలుగులోకి వచ్చిన ఈ వీడియోలో ఒకరి ఇంటి వంటగదిలో గత కొద్ది రోజులుగా వింత శబ్ధాలు వస్తున్నాయట. కిచెన్ పైకప్పులోంచి ఎవరో కొడుతున్న శబ్దం వినిపిస్తుందని ఆ ఇంట్లోని వారు భయాందోళనకు గురయ్యారు. పూర్తిగా ప్యాక్‌ చేయబడిన ఇంటి పై కప్పులోంచి ఇలా వింత శబ్దం ఎలా వస్తుందో అర్థం కాక కుటుంబ సభ్యులు ఒకింత ఆశ్చర్యం, ఆందోళనకు గురయ్యారు. ఆ శబ్దానికి భయపడి రాత్రిపూట సరిగా నిద్రకూడా పట్టటం లేదట. చివరకు ఒకరోజు వంటగది పై కప్పును కాస్త చీల్చి చూడగా, అందులోంచి ఏదో వింత జంతువు తోక ఒకటి బయటపడింది. అది చూసిన కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. వెంటనే వారు రెస్క్యూ టీమ్‌ను సంప్రదించారు. అగ్నిమాపక దళం రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించింది.

ఇవి కూడా చదవండి

లోరూఫ్‌లోంచి కనిపించిన దాన్ని చూడగానే రెస్క్యూ టీంతో పాటూ ఆ ఇంట్లోని వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. తర్వాత దాని తోక పట్టుకుని లాగారు. అయితే మొదట ఎంత లాగినా అది గట్టిగా పట్టుకోవడంతో కిందకు రాలేదు. వారు దాన్ని బలవంతంగా బయటకు లాగారు. ఆ జీవి చూసేందుకు సరిగ్గా మొసలి అంతా పెద్దదిగా అచ్చం బల్లిలా కనిపిస్తుంది. చివరకు వారు ఎలాగోలా మానిటర్ బల్లిని కిందకు లాగేశారు. తర్వాత దాన్ని సురక్షితం ప్రాంతంలో వదిలిపెట్టారు. కాగా, ఈ వింత జీవికి సంబంధించిన భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసి జనాలు సైతం భయాందోళనకు గురవుతున్నారు. ఫైర్‌ సిబ్బంది చూపించిన ధైర్యానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 38 సెకన్ల నిడివి గల ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. వీడియోకి ఇప్పటివరకు 99 లక్షలకు పైగా వీక్షణలు,1 లక్షా 22 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..