Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఫోటోలో ఉన్న చిచ్చరపిడుగు.. ఇప్పుడొక టాప్ పొలిటీషియన్.. రాజకీయ చదరంగంలో రారాజు

కొంతమంది వ్యక్తులను చిన్నప్పటి ఫోటోలు చూస్తే ఇప్పుడు మనం చూస్తున్న వ్యక్తి అతడేనా అనిపిస్తూ ఉంటుంది. కొంతమందిని ఈజీగా గుర్తుపట్టొచ్చు. మరికొంతమందిని అయితే అసలు గుర్తుపట్టలేం. చిన్నప్పటి పోలికలకు ఇప్పటి..

ఈ ఫోటోలో ఉన్న చిచ్చరపిడుగు.. ఇప్పుడొక టాప్ పొలిటీషియన్.. రాజకీయ చదరంగంలో రారాజు
Amit Shah Child Hood
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 21, 2022 | 12:20 PM

కొంతమంది వ్యక్తులను చిన్నప్పటి ఫోటోలు చూస్తే ఇప్పుడు మనం చూస్తున్న వ్యక్తి అతడేనా అనిపిస్తూ ఉంటుంది. కొంతమందిని ఈజీగా గుర్తుపట్టొచ్చు. మరికొంతమందిని అయితే అసలు గుర్తుపట్టలేం. చిన్నప్పటి పోలికలకు ఇప్పటి పోలికలకు చాలా తేడా ఉంటుంది. సినీమా స్టార్ట్స్‌ను అయితే కొంత కుస్తీ పడితే గుర్తుపట్టొచ్చు. అదే పొలిటికల్ స్టార్స్‌ను చిన్ననాటి ఫోటో చూసి గుర్తుపట్టడం కొంచెం కష్టమే. ఈ ఫోటో లో స్మార్ట్ గా కనిపిస్తున్న ఈ అబ్బాయి ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు ప్రస్తుత రాజకీయాల్లో అపరచాణక్యుడు కూడా. ఈ ఫోటో చూసి ఆయనెవరో చెప్పమంటే చెప్పడం చాలా మందికి కష్టం. ఆయనను చిన్నప్పుడు చూసిన వారయితే ఈజీగా గుర్తుపట్టొచ్చేమో కాని.. మిగిలిన వారికి ఈ పొలిటికల్ స్టార్‌ను గుర్తుపట్టడం అంత ఈజీ కాదు.

అదే ఫోటో కాకుండా.. ఆవ్యక్తి పేరు చెప్తే మాత్రం తెలియని వ్యక్తంటూ ఉండరంటే అతిశయోక్తి కాదు. దేశ ప్రధాని నరేంద్రమోదీ పేరు ప్రజలకు ఎంత బాగా తెలుసో.. అంతే బాగా ఈ రాజకీయ నాయకుడి పేరు కూడా తెలుసు. పాలిటిక్స్‌లో ఆయన ప్లాన్ వేశారంటే అవతలి ప్రత్యర్థికి తడిసిపోవల్సిందే. ఆయన వ్యూహలు ఎవరికి అందవంటే అతిశయోక్తి కాదు. అందుకే రాజకీయాల్లో ఆయనను అపర చాణక్యుడిగా పిలుస్తారు. ఇదంతా చదివిన తర్వాత ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో కొంచెం క్లారిటీ వచ్చిందా..

ఆ అబ్బాయి మరెవరో కాదు.. కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్‌ షా. గుజరాత్ శాసనసభ్యుడిగా, రాష్ట్ర హోమంత్రిగా పనిచేసిన ఆయన బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. దేశ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ లోని గాంధీనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేబినేట్ లో హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాల గురించి తెలిసిన వారే కాకుండా.. యూత్‌కు చాలా మందికి అమిత్‌ షా గురించి తెలుసు. ప్రత్యర్థులు ఆయనను ఎంత విమర్శించినా.. రాజకీయ వ్యూహలు రూపొందించడం, వాటిని అమలు చేయడంలో అమిత్‌ షా ఉద్దండులు. ఈ ఫోటో చూస్తే మాత్రం చిన్నప్పుడు అమిత్‌ షా ఎంత స్మార్ట్‌గా ఉన్నారో అనిపిస్తోంది కదా.

ఇవి కూడా చదవండి
Amit Shah

Amit Shah

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..