AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటమ్మా ఇలా ఉన్నారు.. అత్తాగారింట్లో అడుగుపెట్టిన 20 నిమిషాలకే షాకిచ్చిన వధువు..

పెళ్లి పెటాకులు అనే మాట చాలా సార్లు వినే ఉంటారు. ఆ ఆధునిక యుగంలో మ్యాగీ చేసినంత ఈజీగా విడిపోతున్నారు. చిన్న చిన్న కారణాలకే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కేవలం పెళ్లి జరిగిన 20నిమిషాల్లోనే వధువు విడాకులు కావాలని డిమాండ్ చేసింది. అసలు ఏం జరిగిందంటే..?

ఏంటమ్మా ఇలా ఉన్నారు.. అత్తాగారింట్లో అడుగుపెట్టిన 20 నిమిషాలకే షాకిచ్చిన వధువు..
Couple Divorces In Just 20 Minutes
Krishna S
|

Updated on: Dec 02, 2025 | 8:11 PM

Share

ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో ఏది ఆర్డర్ చేసినా పది నిమిషాల్లో ఇంటికి చేరుతోంది. కానీ ఒక వివాహం కూడా అంతకంటే వేగంగా కేవలం 20 నిమిషాల్లోనే ముగుస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో జరిగిన ఈ వింత ఘటన స్థానికంగా కలకలం రేపింది. పెళ్లి మండపం నుంచి భర్త ఇంటికి చేరుకున్న నూతన వధువు, కనీసం దుస్తులు కూడా మార్చుకోకుండానే విడాకులు ప్రకటించింది. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు.

డియోరియా జిల్లా భలౌని నివాసి అయిన విశాల్ మధేసియా.. సాలెంపూర్‌కు చెందిన పూజకు పెళ్లి ఫిక్స్ అయ్యింది. నవంబర్ 25న వరుడు ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి అన్ని కార్యక్రమాలు, విందు ఏర్పాట్లు గ్రాండ్‌గా చేశారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో శుభ ముహూర్తం ప్రకారం వివాహం ఘనంగా జరిగింది. వివాహం అనంతరం నూతన వధూవరులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి చేరుకున్నారు. పూజకు ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత వారిని గదిలోకి పంపించారు.

ఇవి కూడా చదవండి

సరిగ్గా 20 నిమిషాల తర్వాత పూజ బయటకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె నేరుగా అత్తమామల దగ్గరికి వచ్చి “నేను ఈ సంబంధాన్ని కొనసాగించలేను. నేను ఇప్పుడే ఇంటికి వెళ్తాను. నా తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలియజేయండి” అని స్పష్టం చేసింది. తొలుత వధువు జోక్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాతే తెలిసింది వధువు సీరియస్‌గా చెప్పింది అని. విశాల్ ఆమెను ఒప్పించడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత పూజ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు వచ్చి 5 గంటల పాటు ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండనని తెగేసి చెప్పింది. అయితే ఈ నిర్ణయానికి గల కారణాన్ని మాత్రం చెప్పలేదు.

పంచాయతీతో విడాకుల ప్రకటన

ఆ తర్వాత గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. సుదీర్ఘ చర్చల తర్వాత చివరకు ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడాకుల పత్రాలపై సంతకాలు చేసి ఆ బంధానికి ముగింపు పలికారు. నెటిజన్లు ఈ విడాకులను “ఫాస్ట్ డెలివరీ” కంటే వేగంగా జరిగిందని కామెంట్ చేస్తున్నారు. కేవలం 20 నిమిషాల్లో విడాకులు తీసుకునేలా చేసిన ఆ కారణం ఏమిటనేది మాత్రం సస్పెన్స్‌గానే మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..