వావ్‌.. ఏం తెలివిరా సామీ..! అక్కడా ఇక్కడా అడ్కుంటే ఏం లాభం.. !! ఏకంగా ఎయిర్‌పోర్ట్‌లోనే బెగ్గింగ్‌..

|

May 22, 2023 | 4:34 PM

నలుగురిలో కాస్త భిన్నంగా ట్రై చేశాడో వ్యక్తి.. అక్కడా ఇక్కడా అడ్కోవటం ఏంటి.. చిప్‌గా అనుకున్నాడేమో ఏకంగా ఎయిర్‌పోర్టులోనే బెగ్గింగ్‌ మొదలుపెట్టాడు ఓ హైటెక్‌ బిచ్చగాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. సదరు వ్యక్తి ప్రయాణికుల నుంచి డబ్బులు అడుక్కోవడాన్ని

వావ్‌.. ఏం తెలివిరా సామీ..! అక్కడా ఇక్కడా అడ్కుంటే ఏం లాభం.. !! ఏకంగా ఎయిర్‌పోర్ట్‌లోనే బెగ్గింగ్‌..
Begging At Airport
Follow us on

బిచ్చగాడు.. ఇదేదో సినిమా టైటిల్‌ కాదండోయ్‌..! అదేంటంటే..సాధారణంగా రోడ్డు మీద సిగ్నల్స్ వద్ద, ప్రార్థనా స్థలాలు, ట్రైన్లు, బస్టాండ్లల్లో భిక్షాటన చేసేవాళ్లని మనం చూస్తూనే ఉంటాం. కానీ, అందరిలా ఉంటే,.. ఏముంటుంది..? నలుగురిలో కాస్త భిన్నంగా ట్రై చేశాడో వ్యక్తి.. అక్కడా ఇక్కడా అడ్కోవటం ఏంటి.. చిప్‌గా అనుకున్నాడేమో ఏకంగా ఎయిర్‌పోర్టులోనే బెగ్గింగ్‌ మొదలుపెట్టాడు ఓ హైటెక్‌ బిచ్చగాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. సదరు వ్యక్తి  ఎయిర్ ప్రయాణికుల నుంచి డబ్బులు అడుక్కోవడాన్ని ఎయిర్‌పోర్ట్ సిబ్బంది గమనించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే..

విగ్నేష్ అనే 27 ఏళ్ల యువకుడు చెన్నై వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. దీనికోసం ఎయిర్పోర్టులోకి ప్రవేశించాడు. అయితే, అతని ఉద్దేశం చెన్నై వెళ్లడం కాదని… ఎయిర్పోర్టులో.. భిక్షాటన చేయడమని తర్వాత తెలిసింది. విమానాశ్రయంలోకి ప్రవేశించిన సదరు విగ్నేష్… అక్కడున్న ప్రయాణికుల దగ్గరికి వెళ్లి డబ్బులు అడగడం మొదలుపెట్టాడు. తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని, వైద్యం కొరకు సహాయం చేయాలంటూ కథలల్లుతూ వారిని డబ్బు సహాయం అడుగుతున్నాడు. అంతేకాదు ప్యాసింజర్లను ఒక్కొక్కరిని రూ.10వేలు ఇవ్వమంటూ వెంటపడడం మొదలుపెట్టాడు. ఇదంతా చూసిన ప్రయాణికులకు అనుమానం వచ్చింది. వెంటనే విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎయిర్‌పోర్ట్‌ ప్రయాణికుల ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతని మీద 420 సెక్షన్ కింద చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

విమానాశ్రయంలో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని.. అయితే ఇదంతా ఓ ముఠాపని అయి ఉండచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విగ్నేష్ కూడా అలాంటి ముఠాకు చెందిన సభ్యుడు అయి ఉండొచ్చని అంటున్నారు. బెంగళూరు ఎయిర్ పోర్టులో రెండేళ్ల క్రితం ఇలాంటి ఘటన జరిగింది. తాజాగా ముంబై ఎయిర్పోర్ట్లో కూడా ఇలాంటి ఘటన వెలుగు చూసింది. అంతేకాదు, ఆ యువకుడి దగ్గర 26 క్రెడిట్ కార్డులు ఉన్నాయి. వాటిలో 24 పనిచేస్తున్నట్లుగా పోలీసు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..