ఓ ఫైన్ డే.. అత్తమామలకు నిద్రమాత్రలు ఇచ్చి.. ఇద్దరు కోడళ్లు పక్కింటోడితో జంప్..

రోజురోజుకీ వివాహేతర సంబంధానికి సంబందించిన వార్తలు పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంటి ఇద్దరు కోడళ్ళు పొరుగు ఇంటి యువకుడితో పారిపోయారు. ఈ కోడళ్ళు ఇద్దరూ ఒకే యువకుడితో ప్రేమలో పడ్డారు. తర్వాత వారు తమ అత్త, మామ, పిల్లలకు టీలో నిద్రమాత్రలు ఇచ్చి.. తాము ప్రేమించిన పొరుగు ఇంటి యువకుడితో పారిపోయారు. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఓ ఫైన్ డే.. అత్తమామలకు నిద్రమాత్రలు ఇచ్చి.. ఇద్దరు కోడళ్లు పక్కింటోడితో జంప్..
Extra Marital Affair

Updated on: Sep 04, 2025 | 2:54 PM

ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల కేసులు బాగా పెరిగాయి. భార్య భర్త, పిల్లలు అందమైన కుటుంబం ఉన్నప్పటికీ.. వివాహేతర సంబంధాల వైపు ఆకర్షితులవుతున్నారు. వివాహిత పురుషుడు మరొక మహిళతో సంబంధం పెట్టుకుని ఉంటున్నాడు. లేదా భార్య.. వేరేక వ్యక్తితో అక్రమ సంబంధం వంటి వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. అలాంటి వివాహేతర సంబంధం గురించి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఇద్దరు మహిళలు ఒక యువకుడిని ప్రేమించారు. అవును ఒకే ఇంటి ఇద్దరు కోడళ్ళు పొరుగు ఇంటి యువకుడిని ప్రేమించారు. ఆ యువకుడితో పారిపోయేందుకు అత్త, మామలకు నిద్రమాత్రలు ఇచ్చారు. ఈ వార్త వైరల్ అవుతోంది.

తమ ప్రేమికుడితో పారిపోయిన యువతులు:
ఈ వింత సంఘటన సెప్టెంబర్ 01, సోమవారం పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాలలోని బాగ్డా పోలీస్ స్టేషన్ పరిధిలోని మలిడా గ్రామంలో జరిగింది. ఇద్దరు మహిళలు తమ పొరుగువారి ఇంటిలో నివసిస్తున్న ఒక యువకుడితో పారిపోయారు. ఈ ఇద్దరు మహిళలు ఒకే యువకుడితో ప్రేమలో పడ్డారు. సోమవారం ఇంట్లో ఉన్న తమ అత్త, మామ లతో పాటు ముగ్గురు పిల్లలకు నిద్రమాత్రలు ఇచ్చిన తర్వాత.. ఇద్దరు మహిళలు తమ ప్రేమికుడితో పారిపోయారు.

మలిడా గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు యాసిన్ షేక్, అనిసూర్ షేక్. ఈ అన్నదమ్ముల భార్యలు తమ పొరుగున ఉంటున్న ఆరిఫ్ అనే వ్యక్తిని ప్రేమించారు. అతనితో వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసి ఇంట్లో కుటుంబ సభ్యులకు నిద్ర మాత్రలు ఇచ్చారు. అనిసూర్ అదే గ్రామంలోని గ్యారేజీలో పనిచేస్తున్నాడు. ఇక యాసిన్ విదేశాలలో పనిచేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

గ్యారేజ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన అనిసూర్ కి తన తల్లిదండ్రులు, ముగ్గురు కుమార్తెలు అపస్మారక స్థితిలో ఉండటం చూశాడు. వెంటనే బాగ్డా గ్రామీణ ఆసుపత్రికి తలించాడు. తన తల్లిదండ్రులకు స్పృహ తిరిగిన తర్వాత.. ఇంట్లో జరిగిన సంఘటనను వారు అనిసూర్ కి జరిగినది చెప్పారు. అప్పుడే తమ ఇంట్లో జరిగిన విషయం అతనికి తెలిసింది.

దీంతో అనిసూర్ షేక్ ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాగ్డా పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ కేసు లో మరొక వింత ఏమిటంటే.. ఆ ఇద్దరు మహిళలు పారిపోయిన ఆరిఫ్ కూడా వివాహితుడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ ఆరిఫ్ ఒకే ఇంట్లోని ఇద్దరు కోడళ్లను ప్రేమించి.. వారిని తీసుకుని రాత్రికి రాత్రే జంప్ అయ్యాడు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..