దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వైరస్ నుంచి రక్షణ పొందాలంటే మాస్క్ ధరించడం తప్పసరి అని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వాలతో పాటు అధికారులు కూడా మాస్క్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఓ మాజీమంత్రి నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. మాస్క్ పెట్టుకోమని ఓ కార్యకర్త ఇవ్వగా ని దానిని కారులోంచి బయటకు పడేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
బయటకు విసరేసి..
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కొంతమంది దాటియాలోని బామ్ బామ్ మహదేవ్ చౌక్ దగ్గర నిలబడి మాస్క్‌లు ధరించని వారికి మాస్క్‌లు ఉచితంగా పంపిణీ చేశార. అదే సమయంలో మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు ఇమర్తి దేవీ అక్కడకు కారులో వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త ఆమెకు మాస్క్ ఇచ్చాడు. ఇమర్తి దేవి దానిని తీసుకున్నారు. అయితే కారు కొద్దిగా ముందుకు వెళ్లిన వెంటనే మాస్క్‌ను బయటకు విసిరేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు బాధ్యాయుతంగా ప్రవర్తించాల్సిన ప్రజా ప్రతినిధులే ఇలా చేస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.
గతంలోనూ!
కాగా ఇమర్తీ దేవి వివాదాస్పదంగా వ్యవహరించడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో ఆమె కరోనా బారిన పడినట్లు వార్తలు రాగా.. ‘ నేను మట్టి, పేడలో పుట్టాను. కరోనా నా దరిదాపుల్లోకి కూడా రాదు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వీడియో అప్పట్లో బాగా వైరలైంది. తాజాగా మాస్క్ ను విసరేసి ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు.
ये पहले मंत्री बनीं, फिर पूर्व हुईं अब दर्जा प्राप्त मंत्री हैं – इमरती देवी, मास्क नहीं पहनने पर जुर्माना लग रहा है इन्हें @AamAadmiParty कार्यकर्ताओं ने #मास्क दिया लेकिन इन्होंने क्या अभूतपूर्व काम किया देखिये! @ndtv @ndtvindia pic.twitter.com/7yPy5tWBeB
— Anurag Dwary (@Anurag_Dwary) January 22, 2022
Also Read: Coronavirus: తిరుపతి ఐఐటీ క్యాంపస్ లో కరోనా కలకలం.. భారీగా వెలుగు చూసిన పాజిటివ్ కేసులు..
Casino Game: కేసినో నిర్వహణపై టీడీపీ-వైఎస్ఆర్సీపీల మధ్య మాటల యుద్ధం.. చట్టం ఏం చెబుతోంది..