చేప మాంసాన్ని ఇష్టంగా తినేవాళ్లు చాలామంది ఉంటారు. పులుసు పెట్టుంటకుంటారు.. ఫ్రై చేసుకుంటారు.. ఇంకొందరు పచ్చడి చేసుకుని.. తింటారు. అయితే చేప మాంసం కలర్ ఏ రంగులో ఉంటుందని అడిగితే.. వెంటనే ఎరుపు లేదా గులాబీ అని చెబుతారు. చాలా జంతువుల మాంసం గులాబీ రంగులో ఉంటుందనేది వాస్తవమే. అయితే రక్తం ఇతర రంగులో ఉండే జీవులు కొన్ని ఉన్నాయి. తాజాగా ఓ చేపను కట్ చేస్తోన్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సదరు చేప మాంసం ఆశ్చర్యకరంగా నీలం రంగులో ఉంది. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోయారు.
వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వ్యక్తి కత్తితో చేపను కోస్తుండటం మీరు చూడవచ్చు. ఆ, చేప మాంసం నీలం రంగులో ఉండటం మీరు గమనించవచ్చు. ఈ చేప పేరు లింగ్‌కోడ్ అట. దీనిని బఫెలో కాడ్ అని కూడా పిలుస్తారు. ఈ చేప O. ఎలోంగటస్ జాతికి చెందిన హెక్సాగ్రామిడే కుటుంబానికి సంబంధించినదిగా నిపుణులు చెబుతున్నారు.
ముందుగా వీడియో వీక్షించండి..
ఈ ఆశ్చర్యకరమైన కొన్ని సెకన్ల వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో నేచర్27_12 అకౌంట్ నుంచి షేర్ చేశారు. క్యాప్షన్‌లో చేప గురించి సమాచారం ఇస్తూ, యూజర్ దానిని లింగోడ్ చేపగా చెప్పకొచ్చాడు. నెటిజన్లు ఈ వీడియోను విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఒక రోజు క్రితం షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటి వరకు 19 వందలకు పైగా లైక్‌లు వచ్చాయి. బ్లూ మీట్ ఫిష్ వీడియో చూసి కొందరు షాక్ అవుతున్నారు. ‘ఇది అద్భుతంగా ఉంది. నా జీవితంలో ఇలాంటివి మునుపెన్నడూ చూడలేదు’ అని ఓ యూజర్ కామెంట్ పెట్టారు.
Also Read: నడి ఎడారిలో పాపడాల ఫ్రై..