White House : “వైట్‌ హౌస్‌ చూసొద్దాం రండి”.. అయ్ బాబోయ్ ఇది స్వర్గమేమో కాదా ఇది..

వీడియోలో వైట్‌ హౌస్‌లోని అద్భుతమైన గదులు, అలంకరణలు, క్లాసిక్‌ ఫర్నిచర్‌ ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి. ప్రెస్‌ సభ్యులు సమావేశమయ్యే ప్రాంతం, అధ్యక్షుడు ట్రంప్‌, ఆయన కుటుంబం నివసించే వెస్ట్‌ వింగ్‌ సమీపంలోని భవనాన్ని చూపించారు. అందులోని విశాలమంతమైన గదులు, ఫర్నిచర్‌ వావ్‌ అనిపించేలా ఉన్నాయి. ఈ టూర్‌

White House : వైట్‌ హౌస్‌ చూసొద్దాం రండి.. అయ్ బాబోయ్ ఇది స్వర్గమేమో కాదా ఇది..
White House

Updated on: May 01, 2025 | 1:02 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు నివసించే అందమైన వైట్‌ హౌస్‌ ఎలా ఉంటుందో చూడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే, అది అందరికీ సాధ్యం కాదు. అలాంటి వారి కోసమే ఇప్పుడు సోషల్ మీడియా ఒక అద్భుత అవకాశాన్ని అందిస్తోంది. వాషింగ్టన్‌ డీసీలో అమెరికా అధ్యక్షుడు నివసించే భవనం ఎలా ఉంటుందో యూఎస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలినా లీవిట్‌ కళ్లకు కట్టినట్టుగా అందరికీ చూపించారు. ఈ మేరకు ఆమె షేర్‌ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

“వైట్‌ హౌస్‌ చూసొద్దాం రండి” అంటూ అమెరికా అధ్యక్ష భవనంలో ఎలా ఉంటుందో చూపిస్తూ ఓ వీడియో టూర్‌ను యూఎస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలినా లీవిట్‌ షేర్ చేశారు. ఆమె వీడియోను షూట్‌ చేసి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ముందుగా లీవిట్ తనను తాను పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత వైట్‌హౌస్‌లోపలికెళ్లి వీడియో చిత్రీకరించారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

వీడియోలో వైట్‌ హౌస్‌లోని అద్భుతమైన గదులు, అలంకరణలు, క్లాసిక్‌ ఫర్నిచర్‌ ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి. ప్రెస్‌ సభ్యులు సమావేశమయ్యే ప్రాంతం, అధ్యక్షుడు ట్రంప్‌, ఆయన కుటుంబం నివసించే వెస్ట్‌ వింగ్‌ సమీపంలోని భవనాన్ని చూపించారు. అందులోని విశాలమంతమైన గదులు, ఫర్నిచర్‌ వావ్‌ అనిపించేలా ఉన్నాయి. ఈ టూర్‌ వీడియోపై “వైట్‌ హౌస్ అద్భుతః” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..