న్యూజిలాండ్ ఆటగాడు హెన్రీ నికోల్స్ వింతగా ఔటైన వీడియోను భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ షేర్ చేశాడు. ఈమేరకు దానికో ట్యాగ్ కూడా ఇచ్చాడు. దీంతో ఇప్పటికే వైరలవుతోన్న ఈ వీడియో.. సచిన్ షేర్ చేయడంతో మరింతగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వీధి క్రికెట్‌లో ఇలా జరగదని, నాన్ స్ట్రైకర్‌ను మేం ఔట్‌గా ప్రకటిస్తామంటూ చెప్పుకొచ్చాడు. వాస్తవానికి ఆ వీడియోలో నికోల్స్ షాట్ కొట్టినప్పుడు, బంతి అవతలి ఎండ్‌లో నిలబడి ఉన్న బ్యాట్స్‌మన్‌కి తగిలి గాలిలోకి లేచింది. ఫీల్డర్ దానిని క్యాచ్ పట్టాడు. ఈ విధంగా హెన్రీ నికోల్స్ విచిత్రమైన రీతిలో ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో సచిన్ కూడా వీడియోను పంచుకుంటూ సరదాగా కామెంట్ చేశాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో అసలేం జరిగిందంటే?
ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇది జరిగింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు లీడ్స్‌లో (జూన్ 23న) జరగనుంది. ఈ మ్యాచ్‌లో, పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే, ఇది తప్పు అని తేలింది.
దీంతో కివీస్ జట్టు 83 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక్కడ నుంచి హెన్రీ నికోల్స్, డారెల్ మిచెల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తు్న్నారు. అయితే దురదృష్టం కారణంగా నికోల్స్ ఔట్ అయ్యాడు. 99 బంతులు ఆడి 19 పరుగులు మాత్రమే చేశాడు.
?? ????? ???????, ??’? ??????? ??? ???-??????? ??? ?#CricketTwitter https://t.co/vLBl5Rd4eh
— Sachin Tendulkar (@sachin_rt) June 24, 2022
న్యూజిలాండ్ జట్టు స్కోరు 123 పరుగుల వద్ద ఉండగా, స్పిన్నర్ జాక్ లీచ్ 56వ ఓవర్‌ను వేస్తున్నాడు. ఆ ఓవర్ రెండో బంతికి నికోల్స్ నేరుగా షాట్ ఆడాడు. బంతి గాలిలోకి వేగంగా వెళ్లి నాన్‌స్ట్రైక్‌లో నిలబడిన మిచెల్ బ్యాట్‌కు తగిలింది. ఇక్కడి నుంచి బంతి గాలిలో లాంగ్‌ఆఫ్ వైపు వెళ్లగా, ఫీల్డర్ అలెక్స్ లీస్‌కి క్యాచ్ ఇచ్చి నికోల్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. నిబంధనల ప్రకారం నికోల్స్‌ను అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు.