ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో తనదైన శైలీలో ట్విట్లు చేస్తు తరచూ వార్తల్లో కనిపిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు ఆయన చేసే ట్వట్లల్లో కొన్ని కీలక నిర్ణయాలకు సంబంధించి ఫాలోవర్ల కూడా అభిప్రాయం కోరుతుంటారు. అయితే తాజాగా తన మూడేళ్ల కొడుకు ఎక్స్ ఏఈ (X AE A-XII) అడిగిన ప్రశ్నను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దీనికి ఈ ప్రశ్నకు దిల్లీ పోలీసులు ఫన్నీగా సమాధానం ఇచ్చారు. ఇక వివరాల్లోకి వెళ్తే లిటిల్ ఎక్స్ నన్ను ఓ ప్రశ్న అడిగాడని.. పోలీస్ కుక్కలు ఉన్నప్పుడు పోలీస్ పిల్లులు ఎందుకుండవనే సందేహం వచ్చిందని మస్క్ ట్వీట్ చేశాడు.
దీనికి స్పందించిన ఢిల్లీ పోలీసులు మస్క్.. పోలీస్ పిల్లుల లేవని మీ లిటిల్ ఎక్స్‌కు చెప్పండి. ఎందుకంటే పోలీస్ వ్యవస్థలో పిల్లులు ఉంటే వాటిని నేరస్తులుగా అరెస్టు చేయాల్సి వస్తుందని సరదాగా ట్వీట్ చేశారు. మరోవైపు ఢిల్లీ పోలీసులు రిప్లయ్‌కి నెటిజన్లు కూడా వివరణ ఇచ్చారు. సాధారణంగా ఇళ్లలో పిల్లులు ఇతరులకు తెలియకుండా పాలు, పెరుగు వంటి వాటిని స్వాహాచేస్తాయని.. అందుకే వాటినే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని పోలీసులు ట్వీట్ చేశారని కామెంట్ చేశారు. అలాగే మరికొంతమంది నెటీజన్లు పోలీస్ కుక్కలతోపాటు , పిల్లులకు శిక్షణ ఇస్తే అవి రెండు గొడవపడుతూ.. నేరస్థులను విడిచిపెడతాయని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Hi @elonmusk, please tell Lil X that there are no police cats because they might get booked for feline-y and ‘purr’petration. https://t.co/W8CMMvYi9I
— Delhi Police (@DelhiPolice) June 2, 2023
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..