Viral Video: ఏనుగు కోపం దగ్గర నుంచి చూశారా..? ఇలాగే ఉంటుంది మరీ!
బీహార్‌లోని చప్రాలో ఏనుగు విధ్వంసానికి దిగిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయదశమి వేడుకల సందర్భంగా ఏనుగు కారును గాలిలోకి విసిరి బస్సుపై దాడి చేసిన ఘటన బీహార్‌లోని చప్రాలో చోటుచేసుకుంది. బీహార్‌లోని చాప్రాలో విజయదశమి వేడుకల్లో భాగంగా ఓ కుటుంబం ఏనుగుపై ఎక్కింది. అక్టోబర్ 14, 2024న "ఘర్ కే కలేష్" అనే ఎక్స్ ఖాతాలో అప్‌లోడ్ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఏనుగు అకస్మాత్తుగా ఆగ్రహానికి గురై కారుపై దాడి చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
బీహార్‌లోని ఛప్రాలో ఏనుగు విధ్వంసానికి దిగిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయదశమి వేడుకల సందర్భంగా ఏనుగు కారును గాలిలోకి విసిరి బస్సుపై దాడి చేసిన ఘటన బీహార్‌లోని ఛప్రాలో చోటుచేసుకుంది. బీహార్‌లోని చాప్రాలో విజయదశమి వేడుకల్లో భాగంగా ఓ కుటుంబం ఏనుగుపై ఎక్కింది. అక్టోబర్ 14, 2024న “ఘర్ కే కలేష్” అనే ఎక్స్ ఖాతాలో అప్‌లోడ్ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఏనుగు అకస్మాత్తుగా ఆగ్రహానికి గురై కారుపై దాడి చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఫుటేజీలో ఓ ఏనుగు కారును గాలిలోకి తేలికగా ఎత్తి, దాన్ని బొమ్మలాగా తిప్పుతుంది. కారు ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా ఏనుగు తన దూకుడును సమీపంలోని బస్సు వైపు మళ్లించింది. చుట్టుపక్కలవారు ఎంత ప్రయత్నించినా, ఆగ్రహించిన ఏనుగును ఎవరూ అదుపు చేయలేకపోయారు. విధ్వంసాన్ని ఆపలేక ఆ కుటుంబం ఏనుగు వీపుపై నిస్సహాయంగా కూర్చోవడం వీడియోలో కనిపిస్తుంది.
ఈ వీడియోపై నెటిజన్లు రకరకలుగా స్పందిస్తున్నారు. ఒక నెటిజన్ ఇలా వ్యాఖ్యానించారు, “ఆ ఏనుగు శక్తి అవాస్తవమని, ఏనుగు పైన ఉన్న వ్యక్తి దానికి కారణమని పేర్కొన్నాడు. “కారు ఏనుగు ముందు బొమ్మలా ఉందని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. “సింహం అడవికి రాజు కావచ్చు, కానీ ఏనుగు ఖచ్చితంగా అత్యంత శక్తివంతమైన జంతువు.” అని మరోక నెటిజన్ కామెంట్ పెట్టాడు.
వైరల్ అవుతున్న వీడియో:
When Elephant got angry: pic.twitter.com/mRs5JYLEvL
— Ghar Ke Kalesh (@gharkekalesh) October 14, 2024