
వాతావరణం మెల్ల మెల్లగా మారుతోంది. శీతాకాలం నుండి వేసవికి కదులుతోంది. అటువంటి పరిస్థితిలో అడవులు, నగరాలు, గ్రామాలలో ప్రతిచోటా ఉష్ణోగ్రత పెరుగుతుంది. అడవుల్లో నీటి వనరులు ఎండిపోవడం ప్రారంభమవుతుంది. దీంతో అడవి జంతువులు ఆహారం, నీళ్ల కోసం జనావాసాల్లోకి వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనుషులకు, జంతువులకు మధ్య ఘర్షణలు పెరగడం సహజం. అయితే చాలా మంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అడవి గుండా వెళుతున్నప్పుడు వారు జంతువులను చూసి వాటిని ఆటపట్టించడానికి ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు మనుషులు చేసే కొన్ని తప్పిదాలు పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంది. అటువంటి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు IFS అధికారి ప్రవీణ్ కస్వాన్. అది కాస్త వేగంగా వైరల్ అవుతోంది.
మనుషులు తమ వినోదం కోసం అడవి జంతువులకు అంతరాయం కలిగించవద్దంటూ IFS అధికారి ప్రవీణ్ కస్వాన్ ఈ వీడియోను షేర్ చేశారు. దీనికి క్యాప్షన్ అసలు విషయం ఏంటో వివరించారు. వీడియో ప్రకారం.. ఒక ఏనుగు టీ తోట గుండా వెళుతున్న రహదారిని దాటుతోంది. కార్లు రెండు వైపులా దూరంగా పార్క్ చేయబడ్డాయి. ఇంతలో ఓ యువకుడు ఏనుగు దగ్గరికి వెళ్లి దాన్ని ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. ఏనుగు వెనక్కి వెళ్లినప్పుడల్లా ఆ యువకుడు దాని వెంటే వెళ్లి పదే పదే వేధిస్తున్నాడు. ఇంతలో మరికొన్ని ఏనుగులు కూడా రోడ్డు దాటేందుకు వచ్చాయి. కానీ, అవి వెళ్లిపోయిన తర్వాత మొదటి ఏనుగు కూడా రోడ్డు దాటుతుంది. ఈ సమయంలో యువకుడు ఏనుగులను వెంబడిస్తూ వెళ్తున్నాడు.
వీడియో ఇక్కడ చూడండి..
Identify the animal in this video.
Maybe you are young and you can outrun the elephants. But these irritated animals don’t behave peacefully if they see other human for next few days. Don’t irritate wild animals for your fun. pic.twitter.com/chYlLeqx3d
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) January 12, 2025
మరో పోస్ట్‌లో, ఏనుగులపై పరిశోధనలు చేస్తున్న ప్రవీణ్ కస్వాన్, ఏనుగులు చాలా తెలివైన జంతువులుగా వెల్లడించారు. మనుషులతో పరిచయం వారి ప్రవర్తనను చాలా వరకు ప్రభావితం చేస్తుందని చెప్పారు. మానవుల అంతరాయం లేదా ఆటంకం కారణంగానే ఏనుగుల ప్రవర్తనలో పెను మార్పులకు దారి తీస్తుందని చెప్పారు. ఏనుగులను వేధించడం తప్పు మాత్రమే కాదు, వాటి ఆరోగ్యం, ప్రవర్తనను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని రాశారు. ఇది జంతువులకు, మానవులకు ప్రమాదకరం అంటూ ప్రవీణ్ కస్వాన్ ఐఎఫ్ఎస్ హెచ్చరించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..