Viral Video: అయ్యో పాపం.. కరెంటోళ్ల కష్టాలు..! బకాయి బిల్లుల వసూళ్ల కోసం ఇలా కాకా పడుతున్నారు..

|

Feb 21, 2024 | 9:10 PM

విద్యుత్ శాఖ చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ప్రజలు భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మనుషులను బెదిరించే విధానం కాస్త మామూలుగా ఉందని ఒకరు రాశారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్ వచ్చిందని, అది ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతుందని మరొకరు రాశారు. విద్యుత్ శాఖకు అంతగా అప్పులపాలయ్యాయని, అందుకే ఇప్పుడు కవిత్వం కూడా రాయడం మొదలుపెట్టారని మరొకరు ఫన్నీగా స్పందించారు.

Viral Video: అయ్యో పాపం.. కరెంటోళ్ల కష్టాలు..! బకాయి బిల్లుల వసూళ్ల కోసం ఇలా కాకా పడుతున్నారు..
Announcement
Follow us on

నేటికీ చాలా ప్రాంతాల్లో ప్రజలు ప్రతి నెలా విద్యుత్ బిల్లులు చెల్లించరు. ఇందుకోసం ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చి మినహాయింపులు ఇస్తోంది. ఆ తర్వాత కూడా కరెంటు బిల్లు కట్టకపోగా.. కనెక్షన్‌ను డిస్‌కనెక్ట్‌ చేయమని వార్నింగ్‌ ఇచ్చినా.. కరెంటు బిల్లు కట్టని వినియోగదారులను కవితాత్మకంగా హెచ్చరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బకాయి ఉన్న విద్యుత్ బిల్లును చెల్లించడానికి ఇంతకు ముందు ఇలాంటి ప్రకటనను మనం చాలా అరుదుగా చూశాము. బిల్లు కట్టకుంటే కనెక్షన్ తీసేస్తామని, చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని కవిత తరహాలో ప్రజలను ప్రేమగా బెదిరిస్తున్నారు ఇక్కడ విద్యుత్‌ శాఖ సిబ్బంది. వాహనంపై మైక్‌ పెట్టి ప్రకటన చేయడం, బిల్లులు చెల్లించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, వారి కనెక్షన్‌ను కూడా డిస్‌కనెక్ట్ చేయవచ్చని ప్రకటనలో పేర్కొనడం వీడియోలో చూడవచ్చు.

దేవుడి సంకల్పం లేకుండా ఒక్క ఆకు కూడా కదలదని, బకాయి బిల్లులు చెల్లించేందుకు ఇంతకంటే మంచి అవకాశం లేదని ప్రకటనలో చెబుతున్నారు. ఒక వ్యక్తి నిద్ర లేచింది మొదలు.. తిరిగి రాత్రి మళ్లి నిద్రపోయే వరకు వారింట్లో కరెంట్‌ అస్సలు పోకూడదు.. అందుకే కరెంటు బిల్లులు పెండింగ్‌లో ఉన్నవారు వెంటనే తమ బకాయిలు చెల్లించాలని, ఎవరి ఇంట్లోనూ చీకటి ఉండకూడదని చెబుతున్నారు. మనిషి ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగా వెళ్తాడు..కానీ, కరెంటు బిల్లు కట్టని వ్యక్తి ఇంట్లో అంధకారం నెలకొంటుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

విద్యుత్ శాఖ చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ప్రజలు భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మనుషులను బెదిరించే విధానం కాస్త మామూలుగా ఉందని ఒకరు రాశారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్ వచ్చిందని, అది ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతుందని మరొకరు రాశారు. విద్యుత్ శాఖకు అంతగా అప్పులపాలయ్యాయని, అందుకే ఇప్పుడు కవిత్వం కూడా రాయడం మొదలుపెట్టారని మరొకరు ఫన్నీగా స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..