AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నడిరోడ్డుపై దగ్దమైన ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే గుండె గుభేల్..

ఎలక్ట్రిక్ బైక్.. ఇప్పుడు ఎక్కడ చూసినా వీటి జోరు కొనసాగుతోంది. పెట్రోల్ ధరలు కొండెక్కి కూర్చోవడంతో కొత్తగా వాహనాలు...

Viral Video: నడిరోడ్డుపై దగ్దమైన ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే గుండె గుభేల్..
Viral Video
Ravi Kiran
|

Updated on: Apr 25, 2022 | 10:03 AM

Share

ఎలక్ట్రిక్ బైక్.. ఇప్పుడు ఎక్కడ చూసినా వీటి జోరు కొనసాగుతోంది. పెట్రోల్ ధరలు కొండెక్కి కూర్చోవడంతో కొత్తగా వాహనాలు కొనాలనుకునేవారికి.. ఈవీలే బెటర్ ఆప్షన్‌గా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడొక చిక్కొచ్చిపడింది.. ఎంతో ఇష్టపడి ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తుంటే.. తీరా అవి కాస్తా..! డైలాగ్ నేను కంప్లీట్ చేయడం ఎందుకు లెండి.. స్టోరీ చదవితే మీకే అర్ధమవుతుంది.

ఇప్పుడంతా ట్రెండ్‌ మారింది. పెట్రోల్‌, డీజిల్‌ రేట్ల మంటతో ఎలక్ట్రిక్‌ వాహనాలకు గిరాకీ పెరుగుతూపోతోంది. ప్రభుత్వాలు కూడా ఈవీ వాహనాలనే ప్రోత్సహిస్తున్నాయి. దాంతో చాలామంది ఇప్పుడిప్పుడే ఈ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ప్రమాదాలకు ఈవీ వెహికిల్స్‌ కూడా మినహాయింపు ఏం కాదని నిరూపిస్తున్నాయి. కారణాలేమైనప్పటికీ కాలి బూడిద అవుతున్నాయి.. ప్రాణాలు కూడా తీస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ముంబైలోని అంధేరీ ప్రాంతంలో ఓ ఎలక్ట్రిక్‌ బైకులో ఒక్కసారిగా షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడింది. దాంతో బ్యాటరీ నుంచి మంటలు రావడాన్ని గుర్తించిన ఆ బైక్‌ యజమాని వెంటనే ఆపి దిగిపోయాడు. అది వెనువెంటనే.. భీకర పొగలను కక్కుతూ.. మంటలు రావడంతో అందరూ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం తప్పినప్పటికీ.. ఎలక్ట్రిక్‌ వాహనం కూడా ప్రమాదమేనని భావిస్తున్నారు.

బ్యాటరీ స్టాండర్డ్‌ది కాదా.. లేక మితిమీరిన ఛార్జింగ్‌ చేశారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా.. ఎలక్ట్రిక్ వాహనం ఇలా మంటల్లో కాలిపోవడాన్ని చూసి.. వామ్మో ఏ వాహనాలు కొనాలిరా బాబూ అంటూ జనం అవాక్కయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఇది పాత వీడియో అయినప్పటికీ.. ఇటీవల వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్న నేపధ్యంలో పైన పేర్కొన్న వీడియో మరోసారి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Follow Us
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది